లివర్ క్యాన్సర్... ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

ఆరోగ్యమే మహా భాగ్యం అంటారు. అందుకే ఆరోగ్యం విషయంలో ప్రతీ ఒక్కరికీ సరైన అవగాహన ఉండాలి. మన ఆరోగ్యం మన చేతుల్లో అనే విషయం అందరికీ తెలిసి ఉండాలి. మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన ఆర్గాన్ లో ఒకటి కాలేయం. మన శరీరంలో అనేక ముఖ్యమైన పనులు చేసేదిగా దీనికి గుర్తింపు ఉంది. లివర్ సరిగా పనిచేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం.

కాలేయం జీర్ణక్రియకు మూలం
ముఖ్యంగా రక్తాన్ని శుద్ధి చేయడం, మన జీర్ణక్రియకు సహాయపడడం వంటి పనులు కాలేయం చేస్తుంది. కాలేయం మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న మలినాలను శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. పైత్య రసాన్ని ఉత్పత్తి చేసి కొవ్వులను జీర్ణం చేయడంలో సహాయం చేస్తుంది. మన జీర్ణక్రియకు కాలేయం దోహదం చేస్తుంది. కాలేయం గ్లూకోస్ ను గ్లైకోజెన్ రూపంలో నిల్వ చేస్తుంది.

Liver cancer Be careful if you see these symptoms

కాలేయం సరిగ్గా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం
మన శరీరానికి కావలసిన శక్తిని ఇస్తుంది. కాలేయం శరీరంలోని హానికరమైన పదార్థాలను నిర్వీర్యం చేసి శరీరానికి హాని కలగకుండా కాపాడుతుంది. అటువంటి కాలేయం సరిగ్గా పని చేస్తేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అయితే అటువంటి కాలేయానికి కూడా క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది. అందుకే మనం కాలేయ ఆరోగ్యంపైన దృష్టి పెట్టాలి. ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి. మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి. పెను ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి.

కాలేయ క్యాన్సర్ లక్షణాలు
క్యాన్సర్ మహమ్మారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకరంగా మారుతున్న తరుణంలో కాలేయ క్యాన్సర్ గురించి తెలుసుకోవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాలేయ క్యాన్సర్ యొక్క లక్షణాలు ప్రారంభ దశలలో గుర్తించడం కష్టంగా ఉండవచ్చు. కానీ కాలక్రమేణా లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. కొన్ని కాలేయ క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణాలను గమనించినట్లయితే ఇందులో అకస్మాత్తుగా బరువు తగ్గడం ఒకటి ప్రధానంగా కనిపిస్తుంది.

ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చెయ్యొద్దు
కుడివైపున ఎగువన పొత్తికడుపులో నొప్పి, చర్మం కళ్ళు పసుపు రంగులోకి మారడం అంటే కామెర్లు రావడం, శరీరం దురదకు గురి కావడం, పొట్ట లేదా కాళ్లలో వాపు, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపించడం, అలసటగా ఉండడం, శరీరం బలహీనంగా అనిపించడం కాలేయ క్యాన్సర్ లో ప్రధానమైన లక్షణాలుగా ఉంటాయి. లక్షణాలు కనిపించినప్పుడు అసలే నిర్లక్ష్యం చేయకూడదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+