ఈ తేనె ఒక్క స్పూన్ తీసుకుంటే రాత్రంతా జాగారమే!

Mad Honey: సాధారణంగా తేనెను సాంప్రదాయ వైద్యంలో గొంతు నొప్పి, ఫ్లూ, డయాబెటిస్, గ్యాస్ట్రైటిస్, అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్), కీళ్లవాతం వంటి అనేక రుగ్మతలకు ఉపయోగిస్తారు. అయితే నేపాల్, టర్కీలలో మాత్రమే ఉత్పత్తి అయ్యే ఒక ప్రత్యేక రకం తేనె.. దాని ఔషధ గుణాల కంటే, విషపూరితమైన, కామోద్దీపక లక్షణాల కారణంగా వార్తల్లో నిలిచింది. దీనినే 'మ్యాడ్ హనీ' లేదా పిచ్చి తేనె అని పిలుస్తారు.

హిమాలయాల నుంచి వచ్చే విషపూరిత తేనె
హిమాలయ ప్రాంతాలలో పెరిగే 'రోడోడెండ్రాన్' పువ్వుల పుప్పొడి, మకరందాన్ని సేకరించడం ద్వారా అతిపెద్ద తేనెటీగలు ఈ 'మ్యాడ్ హనీ'ని ఉత్పత్తి చేస్తాయి. ఈ తేనెలో గ్రేయానోటాక్సిన్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి తేనెకు మత్తు కలిగించే ప్రభావాన్ని, మధ్యస్తంగా విషపూరితమైన లక్షణాలను అందిస్తాయి. నేపాల్, ఉత్తర భారతంలోని ప్రత్యేక తెగ అయిన గురుంగ్ ప్రజలు ప్రమాదకరమైన కొండలపైకి ఎక్కి, పొగ పెట్టి తేనెటీగలను తరిమి, ఈ తేనెను సేకరిస్తారు.

Mad Honey Why a Teaspoon Acts as a Sex Stimulant But Too Much Causes a Heart Attack

పురాతన గ్రీస్‌లో 'బయో వెపన్‌'గా వినియోగం
'మ్యాడ్ హనీ' చరిత్ర పురాతన కాలం నాటిది. పురాతన గ్రీకు గ్రంథాలలో దీని ప్రస్తావన ఉంది. గ్రీకు సైనిక నాయకుడు క్సెనోఫోన్ తన 'అనాబసిస్' గ్రంథంలో క్రీ.పూ. 401లో సైనికులపై ఈ తేనె చూపిన ప్రభావాల గురించి రాశారు. క్రీ.పూ. 65లో కింగ్ మిత్రైడేట్స్ జనరల్ పాంపే నేతృత్వంలోని రోమన్ సైనికులకు వ్యతిరేకంగా జరిగిన మూడో మిత్రైడేటిక్ యుద్ధంలో ఈ 'మ్యాడ్ హనీ'ని జీవ ఆయుధంగా ఉపయోగించినట్లు తెలుస్తోంది.

సెక్స్ స్టిములెంట్‌గా.. ఆపై ప్రమాదకర దుష్ప్రభావాలు
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ తేనెకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి: సాంప్రదాయకంగా దీనిని కామోద్దీపకంగా , జీర్ణశయాంతర రుగ్మతలు (గ్యాస్ట్రైటిస్), రక్తపోటు చికిత్సకు ప్రత్యామ్నాయ చికిత్సలో ఉపయోగిస్తారు. అయితే దీని మోతాదు చాలా కీలకం. టర్కీకి చెందిన 50 ఏళ్ల భర్త, 42 ఏళ్ల భార్య తమ లైంగిక జీవితంలో ఉత్సాహం కోసం ఒక వారం పాటు ఈ తేనెను ఎక్కువ మోతాదులో తీసుకున్నారు. ఫలితంగా తీసుకున్న కొన్ని గంటల్లోనే వారికి తీవ్రమైన మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (గుండెపోటు) వచ్చి అత్యవసర వార్డులో చేరారు.

ప్రధాన దుష్ప్రభావాలు
మోతాదు మించితే 'మ్యాడ్ హనీ' అనేక తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది:
*తక్కువ రక్తపోటు (Low Blood Pressure)
*శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
*గుండె వేగం తగ్గడం
*మైకం, దృష్టి మసకబారడం
*తీవ్రమైన సందర్భాలలో వికారం, మూర్ఛలు, కండరాల పక్షవాతం, స్పృహ కోల్పోవడం, ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు.

ఈ తేనె చాలా శక్తివంతమైనది, విషపూరితమైనది కాబట్టి వైద్యుడు లేదా సాంప్రదాయ వైద్య నిపుణుల పర్యవేక్షణ లేకుండా దీనిని ఒక చుక్క కూడా రుచి చూడకూడదు. నేపాల్ లేదా టర్కీలో ఉత్పత్తి అయ్యే మ్యాడ్ హనీ మాత్రమే ఈ విషపూరిత ప్రభావాన్ని కలిగి ఉంటుందని గమనించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+