పుల్కాలు నేరుగా గ్యాస్ స్టవ్ మీద కాలుస్తున్నారా?
ఆరోగ్యం కోసం చాలామంది నూనె లేకుండా చపాతీలను పుల్కాలుగా చేసుకుని తింటూ ఉంటారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అన్నం తిననివారు పుల్కాలను తింటారు. అయితే నూనె లేకుండా పుల్కాలను కాల్చడం కోసం నేరుగా స్టవ్ మీదనే పుల్కాలను పెట్టి కాలుస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని భావించి చాలామంది ఈ విధానంలో పుల్కాలను కాలుస్తున్నారు. అయితే ఇది ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని ఆహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పుల్కాలను గ్యాస్ పై నేరుగా కాల్చి తింటే అనారోగ్య సమస్యలు
పుల్కాలను నేరుగా మంట మీద పెట్టి కాల్చడం వల్ల గ్యాస్ నుండి వెలువడే కాలుష్యం కారణంగా శ్వాస కోస వ్యాధులు వస్తాయని, గుండె సంబంధమైన సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. గ్యాస్ స్టవ్ మీద చపాతీలు కాల్చేటప్పుడు గ్యాస్ స్టవ్ మండేటందుకు ఇంధనం అయిన గ్యాస్ లో కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ తో పాటు సూక్ష్మ రేణువులు ఉంటాయని ఇవి మండినప్పుడు కాలుష్యాన్ని విడుదల చేస్తాయని చెప్తున్నారు.

క్యాన్సర్ ప్రమాదం జాగ్రత్త
వీటి ప్రభావం గ్యాస్ స్టవ్ పైన పెట్టి కాల్చిన చపాతీలపైన కచ్చితంగా ఉంటుందని చెబుతున్నారు. ఇక చపాతీలను నేరుగా మంటపై అధిక ఉష్ణోగ్రత వద్ద కాల్చడం వలన కార్సినోజెనిక్ సమ్మేళనాలు కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని చెబుతున్నారు. అంతేకాదు గ్యాస్ స్టవ్ పైన నేరుగా చపాతీలను పెట్టి కాల్చినప్పుడు నేరుగా ఉష్ణోగ్రత తగలడం వల్ల చపాతీలు మాడిపోయే అవకాశం కూడా ఉంటుందని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
గ్యాస్ పైన నేరుగా వేటిని కాల్చి తిన్నా ప్రమాదమే
ఇలా నేరుగా స్టౌ పైన చపాతీ కాల్చడం వల్ల క్యాన్సర్ కారకాలు ఉత్పత్తి అవుతాయని పేర్కొన్నారు ఏది ఏమైనా ఇప్పటివరకు జరిగిన అనేక పరిశోధనలు గ్యాస్ స్టవ్ పైన నేరుగా కాల్చిన ఆహారం తినడం మంచిది కాదని తేల్చాయి. ఒక చపాతీలు మాత్రమే కాదు గ్యాస్ స్టవ్ పైన నేరుగా వేటిని కాల్చి తిన్నా ప్రమాదమేనని అవి పేర్కొన్నాయి. కనుక మనం తినే ఆహారం విషయంలో ఏది ఎలా వండుకు తినాలి అనేది కూడా కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications