Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

"మామిడికాయ పప్పు"తో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా.. ఎలా చేయాలంటే ??

మామిడికాయ పప్పు అనేది తెలుగు రాష్ట్రాల్లో తరతరాలుగా వండుతున్న సాంప్రదాయ వంటకం. సాధారణంగా ఉగాది నుంచి వేసవి అంతం వరకు ప్రతి ఇంట్లో ఈ వంటకం సువాసన వెదజల్లుతూనే ఉంటుంది. పుల్లని మామిడికాయ రుచి, పప్పు మాధుర్యం, తాలింపు సువాసన.. ఇలా అన్నీ కలగలిపి ఈ పప్పును ఇతర వంటకాల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి. అంతే కాకుండా మామిడికాయ పప్పు ఏ భోజనమైనా ఒక రుచికరమైన కాంబినేషన్ ఇస్తుంది. వేడి వేడి అన్నం మీద నెయ్యి వేసి మామిడికాయ పప్పు పైన పోసుకుంటే.. ఆ రుచిని మాటల్లో చెప్పలేం. రోటీ, చపాతీలకు కూడా మామిడికాయ పప్పు అద్భుతంగా సరిపోతుంది.

మామిడికాయ పప్పు కేవలం రుచికరమైన వంటకం మాత్రమే కాదు, అనేక పోషకాల సమాహారం కూడా. మామిడికాయలో ఉండే సహజ ఎంజైములు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. పప్పులోని ఫైబర్ జీర్ణాశయాన్ని బలపరుస్తుంది. అలానే విటమిన్ C పుష్కలంగా ఉండటం వల్ల వేసవిలో రోగాల నుంచి రక్షిస్తుంది. పిల్లలు, పెద్దలు ఇద్దరికీ ఇది ఎంతో ఉపయోగకరం. మామిడకాయలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.

mango-dal-making-recipe-in-telugu-with-easy-tips

ఇక పప్పులోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. కాగా విటమిన్ A చర్మం ప్రకాశవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. పప్పులోని ప్రోటీన్ జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. విటమిన్ A, C, E, K, రాగి, మెగ్నీషియం వంటి ప్రాణరక్షక యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. ఈ వంటకం ఎలా తయారు చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

మామిడికాయ పప్పు తయారీలో వాడే పదార్థాలు..

  • కందిపప్పు
  • తాజా పచ్చి మామిడికాయ
  • పచ్చిమిర్చి
  • పసుపు
  • ఉప్పు
  • తాలింపు కోసం..
  • నూనె
  • ఆవాలు
  • జీలకర్ర
  • ఎండుమిర్చి
  • కరివేపాకు
  • ఇంగువ
  • వెల్లుల్లి ( కొన్ని ప్రాంతాల్లో తాలింపులో వేస్తారు )

మామిడికాయ పప్పు తయారీ విధానం..

  • ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి అరగంట నానబెట్టడం వల్ల పప్పు త్వరగా, మెత్తగా ఉడుగుతుంది.
  • కుక్కర్‌లో పప్పు, మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు వేసి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తారు.
  • తరువాత గరిటెతో బాగా మెదపడం వల్ల పప్పు క్రీమీయ్‌గా మారుతుంది.
  • తాలింపులో వేడి నూనెలో ఆవాలు, జీలకర్ర చిటపటలాడే సరికి ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేయిస్తారు.
  • ఈ తాలింపును పప్పులో కలిపి, ఉప్పు జోడించి కొన్ని నిమిషాలు మరిగిస్తే సువాసన గాలిలో విరబూస్తుంది.
  • కొన్ని ఇళ్లలో చివర్లో కొత్తిమీర కూడా జోడిస్తారు.
  • కొంతమంది పప్పును మరింత ఘాటుగా కావాలనుకుంటే పచ్చిమిర్చి బదులు ఎండుమిర్చి పొడి కూడా కొద్దిగా వేస్తారు.
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+