పుదీనా ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
పుదీనా .. మనకు ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే అద్భుతమైన ప్రకృతి వరప్రసాదిని. పుదీనాను నిత్యం ఆహారంలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మంచి రుచితో పాటు సువాసన కూడా ఇచ్చే పుదీనాను వివిధ రూపాల్లో ఆహారంలో భాగం చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్పవచ్చు.
పుదీనాతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు
మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పుదీనాలో ఉన్నాయి. పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి-6, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మన జీవక్రియను మెరుగుపరచటానికి ఉపయోగపడతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజు పుదీనా వాటర్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

బరువుతో పాటు అనేక రోగాలకు పుదీనాతో చెక్
పుదీనాతో ఈజీగా బరువు తగ్గవచ్చు. పుదీనా నీటిని తాగటం, పుదీనా టీ తాగటం మనం ఊహించని ఫలితాలను ఇస్తుంది. పుదీనా ముసలితనం త్వరగా రాకుండా ఉండడానికి కూడా చాలా బాగా పని చేస్తుంది . పుదీనా నీటిని తాగడం వల్ల మన శరీరానికి శక్తి లభించడమే కాకుండా, చర్మ సంబంధమైన అనేక సమస్యలు తగ్గుతాయి. పుదీనాతో కాలిన గాయాలు కూడా తగ్గుతాయి. కళ్ళ క్రింద నలుపు తగ్గటానికి కూడా పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది.
పుదీనాతో మెరుగైన జీవక్రియ
పుదీనా మన జీవక్రియను మెరుగుపరచి, శరీరంలో ఏర్పడిన మలినాలను తొలగించి జీర్ణక్రియను సాఫీగా చేయడానికి, జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి ఉపయోగపడుతుంది. పుదీనాను మజ్జిగతో కలిపి తీసుకుంటే మన శరీరంలో వేడి తగ్గుతుంది. పుదీనా ఆకులను మెత్తగా నూరి ముఖానికి రాసుకుంటే ముఖం ప్రకాశిస్తుంది. మన అందాన్ని పెంచటంలో కూడా పుదీనా ఆకులది ప్రత్యేక స్థానం.
పుదీనాతో రోగనిరోధక శక్తి మెరుగుదల
పుదీనా దంత సమస్యలను, చిగుళ్ల సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా నోటి దుర్వాసనకు చెప్పి చెక్ పెట్టి, దంతాలను తెల్లగా మెరిసేలా చేస్తుంది. ముఖం పైన వచ్చిన మొటిమలను, మచ్చలను తగ్గించడంలో కూడా పుదీనా ఎంతగానో ఉపయోగపడుతుంది. పుదీనాతో రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పుదీనా మలబద్దకం నివారిస్తుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న పుదీనాను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications