రెండు నిమ్మకాయలతో అమోఘమైన నిమ్మకాయ పప్పు.. సూపర్ టేస్ట్!
మన శరీరానికి కావలసిన పోషకాలను ఇచ్చేది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆహారమే. అటువంటి ఆహారంలో ప్రతిరోజు మనం ఏం కూరలు తింటున్నాం అనేది చాలా ప్రధానం. మనం తీసుకునే ఆహారమే మన శరీరానికి కావలసిన శక్తిని ఇవ్వడంతో పాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
నిమ్మకాయ పప్పు
మనం తీసుకునే ఆహారంలో పప్పు ఉండేలా చూసుకోవడం చాలా మంచిది. పప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అటువంటి పప్పును మనం రకరకాలుగా వండుకోవచ్చు. రుచికరమైన నిమ్మకాయ పప్పును ఈ విధానంలో చేస్తే ఒక్క మెతుకు కూడా అన్నం మిగిల్చకుండా మీరు లాగించేస్తారు.

నిమ్మకాయ పప్పు తయారీకి కావలసిన పదార్థాలు
నిమ్మకాయలు -రెండు
కందిపప్పు- 150 గ్రాములు
పచ్చిమిరపకాయలు- నాలుగు
పసుపు -పావు స్పూను
ఉప్పు- ఒకటిన్నర స్పూను రుచికి తగినంత
కారం- ఒకటిన్నర స్పూను రుచికి తగినంత
పోపు గింజలు- ఒక స్పూను
వెల్లి పాయలు- 4 రెబ్బలు
కరివేపాకు- రెండు రెమ్మలు
కొత్తిమీర- కొద్దిగా
నూనె- రెండు టేబుల్ స్పూన్లు
ఎండు మిరపకాయలు - 2
తయారీ విధానం
తయారీ విధానానికి వస్తే కుక్కర్లో 150 గ్రాముల కందిపప్పు వేసి సరిపడా నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత పప్పును మెత్తగా మెదిపి, అందులో పసుపు, ఉప్పు, కారం కలిపి, అన్నంలో కలుపుకోవడానికి కావలసిన కన్సిస్టెన్సీ ఉందో లేదో చూసుకొని మనకు కావలసినంత కన్సిస్టెన్సీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి.
పప్పు ఇలా చేస్తే టేస్ట్
ఆ తర్వాత స్టౌ పైన పాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో పోపు గింజలు వేసి వెల్లిపాయలను కచ్చాపచ్చాగా దంచి అందులో వేయాలి. ఎందు మిర్చి, పచ్చిమిర్చి కూడా వేసి అది కాస్త వేగిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఆపై ఈ పోపును పప్పులో పోయాలి. పప్పును ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి.
ఒక్క మెతుకు కూడా అన్నం వదలరు
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు కొద్దిగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని మనం తినేంత పులుపును చూసుకొని పోయాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు నిమ్మరసం యాడ్ చేయకూడదు. అలా యాడ్ చేస్తే పప్పు చేదు వస్తుంది. ఈ పప్పు తోటి ఏదైనా ఫ్రై కానీ, ఆమ్లెట్ కానీ వేసుకుని తింటే అదిరిపోతుంది. మెతుకు కూడా అన్నం వదలకుండా లాగించేస్తారు. మరి ఎందుకు ఆలస్యం ఏ కూరగాయలు అవసరం లేకుండా రెండు నిమ్మకాయలతో రుచికరమైన నిమ్మకాయ పప్పును ట్రై చేయండి.












Click it and Unblock the Notifications