ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే..?
ప్రతి ఒక్కరూ ఎంతో ఆరోగ్యంగా ఉండడానికే ప్రయత్నాలు చేస్తుంటారు. జీవితంలో మనం ఏది కోల్పోయినా తిరిగి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ సమయం, ఆరోగ్యాన్ని కోల్పోతే తిరిగి సాధించలేం. అందుకే ఎటువంటి అజాగ్రత్తలకు తావివ్వకుండా ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు ప్రయత్నించాలి. అసలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
అధిక బరువు : అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయంటే దానికి కారణం అధిక బరువు. అందుకే మొదటిగా బరువును నియంత్రించుకోవాలి. బరువు తగ్గాలి అనుకునేవారు ఆహారం తినడం మానేస్తుంటారు. కానీ ఇలా చేయడంవల్ల శరీరంలో నీరు చేరుతుంది. దీనివల్ల అదనంగా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా లావుగా కనిపిస్తారు. అందుకే తినడం మానేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రొటీన్లు, ఫైబర్ : మనం రోజూ తీసుకునే ఆహారం ఆరోగ్యవంతమైనదై ఉండాలి. ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండేవి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు, ఎగ్ వైట్, చిరుధాన్యాలు, ఉడకబెట్టిన పప్పులు వంటి ఆహారాన్ని తీసుకుంటుండాలి. కొవ్వు, చక్కెర స్థాయిలు అధికంగా ఉండే ఆహారాన్ని తినకూడదు. మంచినీరు ఎక్కువగా తాగుతుండాలి. ప్రతిరోజు కచ్చితంగా వ్యాయామం చేస్తుండాలి. అలాగే ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. మంచి నిద్ర అధిక బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ధూమపానం, మద్యపానం మానేయాలి. మద్యపానం మనిషి బరువును పెంచుతుంది. అందుకే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. మీకు ఈ అలవాట్లుంటే ఆరోగ్యం మంచిగా ఉన్నట్లే.












Click it and Unblock the Notifications