పాలకూర ఉల్లికారం.. ఇలా చేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!
పాలకూరలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇందులో ఐరన్, విటమిన్లు A, C, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు గుండె ఆరోగ్యానికి, కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడతాయి. అయితే చాలా మంది పాలకూరను పప్పులో టమాటా వేసి కర్రీలో వాడతారు. అయితే పాలకూర ఉల్లికారం కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. పాలకూర ఉల్లికారం కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..?
పాలకూర ఉల్లికారం కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పాలకూర కట్టలు 3,
నూనె 4 టేబుల్ స్పూన్ లు, తాలింపు గింజలు ఒక టీస్పూన్, ఎండుమిర్చి రెండు లేదా మూడు, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, ధనియాల పొడి ఒక టీస్పూన్, జీలకర్ర పొడి అర టీస్పూన్ తీసుకోవాలి. అలాగే ఉల్లికారం కోసం ఉల్లిపాయలు మూడు లేదా నాలుగు, వెల్లుల్లి రెబ్బలు 20, కారం తగినంత, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి.
పాలకూర ఉల్లికారం తయారీ విధానం చూస్తే.. పాలకూరను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను సైతం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి మెత్తగా కాకుండా కాస్త బరకగా ఉండే విధంగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని నూనె వేయాలి. అందులో తాలింపు గింజలు ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి.

ఇప్పుడు అందులో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేసి కలిపి మగ్గించాలి. ఆ తర్వాత అందులో పాలకూర వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. అలా మధ్యమధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. నూనె పైకి తేలిన తర్వాత పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి మరికాసేపు వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరి.. వేడి వేడి పాలకూర ఉల్లికారం కర్రీ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications