కంప్యూటర్లు, మొబైల్స్ ఎక్కువగా వాడేవారు కళ్లు జాగ్రత్త.. ఈ ఆహారాలు తినండి!!
చాలామంది రోజంతా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్ స్క్రీన్లు చూస్తూ ఉంటారు. దీనివల్ల కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. ఇక వయస్సు పెరుగుతుంటే కూడా కంటి చూపు మందగిస్తుంది. అయితే కంటిచూపును కాపాడుకోవటానికి చాలా మంది దృష్టి సారించరు. కంటి సమస్య ఎక్కువైన తర్వాత ఆస్పత్రుల బాట పడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కంప్యూటర్ల ముందు పనిచేసేవారు మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి ఏం చెయ్యాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
కంటి ఆరోగ్యం కోసం ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల విషయానికి వస్తే సిట్రస్ పండ్లలో కంటి ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఉంటాయి. బత్తాయి, నారింజ వంటి పండ్లలో కంటికి ఉపయోగపడే పోషకాలు ఉంటాయి. నారింజ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కెరోటినాయిడ్లు కంటి చూపును మెరుగుపరుస్తాయి.

ప్రతీరోజూ ఒక గ్లాస్ క్యారెట్ జ్యూస్ తాగటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్ లో ఉండే పోషకాలు కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చేపలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరో మంచి ఆహారం. చేపలలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇక మన ఆహారంలో ఆకుకూరలు చేర్చుకుంటే కూడా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. బచ్చలికూర వంటి ఆకుకూరలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి.
కంటి ఆరోగ్యాన్ని బాదం పప్పు బాగా పెంచుతుంది. బాదం పప్పు నానబెట్టి నిత్యం రెండు పప్పులు తినటం కంటికి మేలు చేస్తుంది. గ్రుడ్లు, చికెన్ కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అద్భుతమైన ఆహరం. గ్రుడ్లలో జింక్, విటమిన్ ఏ ఉంటుంది. ఇది కళ్ళకు మేలు చేస్తుంది. చికెన్ లో ఉండే ప్రోటీన్ కంటి ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది.

మనం తీసుకునే ఆహారంలో టమాటాలను చేరిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. టమాటాలలో మన కంటి చూపును కాపాడే లైకోపీన్ ఉంటుంది. ఈ ఆహారాలను కంటి చూపును మెరుగుపరచుకోవటం తీసుకోవటంతో పాటు కంప్యూటర్ల ముందు పని చేసేవారు గంటకో మారు బ్రేక్ తీసుకుని చిన్న చిన్న కళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజులు చెయ్యటం మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications