షుగర్ ఉన్నవారికి బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. షాకింగ్ రీజన్స్ ఇవే!
డయాబెటిస్... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఇక ముఖ్యంగా టైప్ టు డయాబెటిస్ బారిన పడిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు మరింత తీవ్రంగా మారుతుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ బారిన పడిన వారికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎందుకు ఎక్కువగా ఉంటుంది అన్న దానిపైన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వారు కీలక విషయాలను వెల్లడించారు.
డయాబెటిస్ ఉన్నవారిలో ఈ మార్పులు
టైప్ టు డయాబెటిస్ ఉన్నవారిలో మధుమేహం కారణంగా రక్తంలో ఉండే ఎక్సోజోమ్స్ అనే అతి సూక్ష్మమైన కణాల స్వభావం మారిపోతుందని ఈ అధ్యయనం తేల్చింది. ఈ విధంగా మార్పు చెందిన ఎక్సో జోమ్ లు, మన శరీరంలోని వ్యాధి నిరోధకశక్తి పైన దాడిచేసి రోగ నిరోధక వ్యవస్థ పనిచేసే తీరును మారుస్తుంది. డయాబెటిస్ వల్ల ఏర్పడే క్యాన్సర్ కణితులలోకి ప్రవేశించి, అక్కడి రోగనిరోధక కణాలను ఎక్సోజోమ్ లు బలహీనపరుస్తున్నాయి.

క్యాన్సర్ పై పోరాటం చెయ్యలేని సహజ రక్షణా వ్యవస్థ
దీనివల్ల మన శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థ క్యాన్సర్‌పై పోరాటం చేయలేక పోతుంది. ఫలితంగా క్యాన్సర్ వేగంగా పెరగడమే కాకుండా ఇతర భాగాలకు సులభంగా వ్యాపిస్తోందని పరిశోధకులు గుర్తించారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలో టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో, బ్రెస్ట్ క్యాన్సర్ ఆందోళనకరంగా పెరుగుతుందని దీని వెనుక ఉన్న కారణాన్ని అధ్యయనం చేసినప్పుడు కీలక విషయాలు బయటపడ్డాయని చెప్పారు.
డయాబెటిస్ తో క్యాన్సర్ పెరగటానికి కారణాలు ఇవే
ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ గెరాల్డ్ డెనిస్ మాట్లాడుతూ డయాబెటిస్ వల్ల కన్నతల్లి రోగనిరోధక వ్యవస్థ పనిచేసే తీరు మార్పు చెందుతుందని, ఇమ్యునో థెరపీ వంటి చికిత్సలు డయాబెటిస్ రోగులకు ఎందుకు పనిచేయవో అధ్యయనం చేశామని పేర్కొన్నారు. ఈ అధ్యయనంలో కీలక విషయాలు తెలిశాయి అని పేర్కొన్నారు.
అధ్యయనంలో కొత్త విషయాలు
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి ఎక్సోజోమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణితుల్లోని రోగనిరోధక శక్తిని అణిచివేస్తున్నాయని ప్రత్యక్షంగా నిరూపించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇది కేవలం బ్రెస్ట్ క్యాన్సర్ కు మాత్రమే కాకుండా డయాబెటిస్ రోగుల్లో ఇతర క్యాన్సర్ ల ఇంటికి కూడా వర్తించే అవకాశం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications