ఈ బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువ... జాగ్రత్త!
ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి డయాబెటిస్. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా ఉన్న భారతదేశంలో కూడా డయాబెటిస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. సరైన జీవన శైలి లేకపోవడం, మంచి ఆహారపు అలవాట్లు లేకపోవడం, ఒత్తిడి వంటి అనేక కారణాలు చాలా మందిని డయాబెటిస్ బాధితులుగా మారుస్తున్నాయి. మన దేశంలో దాదాపు ఏడు కోట్ల మంది డయాబెటిస్ బాధితులు ఉన్నట్టు ఒక అంచనా.
డయాబెటిస్ కు బ్లడ్ గ్రూప్స్ కు సంబంధం.. అధ్యయనం
డయాబెటిస్ ఎందుకు వస్తుంది? ముఖ్యంగా ఏ బ్లడ్ గ్రూప్స్ వారికి ఎక్కువగా వస్తుంది? అంటే..డయాబెటిస్ రావడానికి క్రమబద్ధమైన జీవన శైలి లేకపోవడం కారణమని ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే యూరోపియన్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ డయాబెటిస్ కు చెందిన డయాబెటాలోజియా అనే జర్నల్లో దీనిపైన నిర్వహించిన ఒక అధ్యయనం వెలుగులోకి వచ్చింది.

ఈ బ్లడ్ గ్రూప్స్ వారికే డయాబెటిస్ ఎక్కువ వచ్చే అవకాశం
కొన్ని రకాల బ్లడ్ గ్రూప్స్ కు టైప్ టు డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఈ అధ్యయనంలో తేలింది. బ్లడ్ గ్రూప్ కు టైప్ టు డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధాన్ని నిశితంగా వెల్లడించారు. మొత్తం 80వేల మంది మహిళలను పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. బ్లడ్ గ్రూపులలో ఏ, బి, ఏబి బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి డయాబెటిస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని తేల్చారు.
ఇతర బ్లడ్ గ్రూపులకు డయాబెటిస్ చాన్స్ ఎంతంటే
అయితే మిగతా బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారికి డయాబెటిస్ రాదని మాత్రం చెప్పలేదు. ఇతర బ్లడ్ గ్రూప్స్ వారికి కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని కానీ ఎక్కువగా డయాబెటిస్ ముప్పు పైన పేర్కొన్న బ్లడ్ గ్రూప్స్ వారికి మాత్రమే ఉందని అధ్యయనంలో వెల్లడించారు. ముఖ్యంగా బి బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి మరీ ఎక్కువగా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
మహిళలలకు డయాబెటిస్ రిస్క్ ఎంత ఎక్కువంటే
ఈ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం ఈ రిస్క్ మహిళలకు 21 శాతం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే 'o' బ్లడ్ గ్రూప్ తో కంపేర్ చేస్తే ఏ గ్రూప్ వారికి టైప్ టు డయాబెటిస్ వచ్చే ప్రమాదం 10% ఎక్కువ అని, ఇక o నెగటివ్ బ్లడ్ గ్రూప్ తో పోలిస్తే బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నవారికి రిస్క్ ఎక్కువగా ఉందని అధ్యయనం ద్వారా తెలిపారు.
నాన్ o బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో డయాబెటిస్ రిస్క్
ఇక బ్లడ్ గ్రూప్ కు డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధం ఇప్పటివరకు పూర్తిస్థాయిలో అధ్యయనం చేయలేదు. నాన్ విల్లే బ్రాండ్ ఫ్యాక్టర్ అనే ప్రోటీన్ నాన్ o బ్లడ్ గ్రూప్ వ్యక్తుల్లో ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇక ఇదే డయాబెటిస్ కు దారి తీసే బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుందని అంచనా వేస్తున్నారు. అయితే బ్లడ్ గ్రూపు కూడా డయాబెటిస్ కు మధ్య ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు అధ్యయనం జరుగుతుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications