ముఖం మీద ముడతలు రాకుండా యవ్వనంగా ఉంచే ఫూల్ మఖానా!!
కొంతమంది ఎంత వయసు వచ్చినా ముఖం మీద ఎలాంటి ముడతలు లేకుండా చర్మం కాంతివంతంగా అందంగా కనిపిస్తారు. దీనికి ముఖ్యమైన కారణం వారి ప్రతిరోజూ తీసుకునే పౌష్టిక ఆహారం. పౌష్టిక ఆహారం తీసుకునే వారిలో ముఖం కాంతివంతంగా, అందంగా, వృద్ధాప్య చాయలు త్వరగా దగ్గరికి రాకుండా కనిపిస్తారని చెబుతారు.
మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కొన్ని డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. అంతేకాదు ఫూల్ మఖానా తో కూడా అందం, ఆరోగ్యం వస్తుందని చెబుతున్నారు. చాలామందికి తెలియని ఫూల్ మఖానా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తామర గింజలను పేలాల మాదిరిగా వేపితే ఫూల్ మఖానా తయారవుతుంది. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది.

100 గ్రాముల ఫూల్ మఖానాలో 347 క్యాలరీల శక్తి, 9.7గ్రాముల ప్రోటీన్, 14.5గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది వృద్ధాప్య చాయలు త్వరగా రాకుండా చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఈ సూపర్ ఫుడ్ ను ఆహారంలో తీసుకోవడం వల్ల ఇది ఫ్రీ రాడికల్స్ ను తొలగిస్తుంది. చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఫూల్ మఖానా చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తుంది. నల్లటి మచ్చలను తగ్గించి చర్మం కాంతివంతం చేయడానికి పనిచేస్తుంది.
దీనిలో యవ్వనంగా కనిపించేలా చేసే గ్లుటామైన్, సిస్టీన్, అర్జినిన్, మెథియోనిన్ వృద్ధాప్య నిరోధక లక్షణాలను కలిగి చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తుంది. నూనెలో వేయించ కుండా నేరుగా పెనం మీద కాల్చుకుని వీటిని తింటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. అంతేకాదు ఫుల్ మఖానా గింజలను ఉడకబెట్టుకుని తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు.
దక్షిణ భారతదేశంలో కంటే ఉత్తర భారత దేశంలో వీటిని ఎక్కువగా తింటారు.ఫూల్ మఖానా తినడం వల్ల ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు తగ్గుతాయి. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. ఫూల్ మఖానా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఫూల్ మఖానా కూర కూడా మన శరీరానికి కావాల్సిన పోషకాలను ఇస్తుంది. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications