రెస్టారెంట్ స్టైల్ "ఆలూ కుర్మా" ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి..!
బంగాళా దుంప.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. అటు కూర గానూ ఇటు ఫ్రై గానూ బంగాళాదుంప టేస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే బిర్యానీ, చపాతీ, పులావ్, రోటీ... ఏ వంటకంతో పాటు అయినా టేస్టీగా ఉండేందుకు బంగాళాదుంపను కుర్మా లాగా చేసుకుంటే భలే ఉంటుంది. అయితే ధాభా స్టైల్ లో ఈ వంటకాన్ని చేస్తే మాత్రం ఒక్క ముక్క కూడా వదిలిపెట్టకుండా మొత్తం లాగించేస్తారు అనడంలో సందేహం అక్కర్లేదు.
ఎప్పుడూ చేసే రొటీన్ వంటకాల నుంచి చిన్న బ్రేక్ కావాలనిపించినప్పుడు ఈ కుర్మా ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. మసాలాల సువాసన, పెరుగు ఇచ్చే కొంచెం పులుపు, బంగాళదుంపల సాఫ్ట్ టెక్స్చర్ కలిసి ఈ కుర్మాను మరింత రుచికరంగా మారుస్తాయి. అందుకే ఇంట్లో తక్కువ ఖర్చుతో, ఎక్కువ టైమ్ తీసుకోకుండా.. హోటల్ స్టైల్ లో "ఆలూ కుర్మా" ఎలా చేసుకోవాలో మీకోసం ప్రత్యేకంగా..

"ఆలూ కుర్మా"కి కావాల్సిన పదార్థాలు..
బంగాళదుంపలు - 3
నూనె - 3 టేబుల్ స్పూన్లు
దాల్చినచెక్క - 1 అంగుళం
లవంగాలు - 3
యాలకులు - 2
ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది)
పచ్చిమిర్చి - 3 (చీలికలు)
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - ½ టీస్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ½ టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
పెరుగు - 3-4 టేబుల్ స్పూన్లు (బీట్ చేసినది)
మిరపకారం - తగినంత
జీలకర్ర పొడి - ½ టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
కసూరి మేతి - 1 టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా (తరుగు)
( స్వల్పంగా ఒక టీస్పూన్ కొబ్బరి పాలు వేసినా స్పెషల్ సౌత్ ఇండియన్ టచ్ వస్తుంది. అర్ధ టమాట ముద్ద వేసినా కొంచెం గ్రేవీకి గ్లాసీ లుక్ వస్తుంది. )
తయారీ విధానం..
ముందుగా బంగాళదుంపలను బాగా కడిగి ఉడికించాలి. పొట్టు తీసి మధ్యస్థ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఇలా ఉడికించిన బంగాళదుంపలు గ్రేవీని బాగా సోక్ చేస్తాయి.
పాన్‌లో నూనె వేసి వేడెక్కాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఈ స్టెప్ కుర్మాకు అసలు ఫ్లేవర్‌ని సెట్ చేస్తుంది.
తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంతవరకు వేయించాలి. ఈ సమయంలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
ఆ తర్వాత ఉప్పు, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కచ్చి వాసన పోయే వరకు కలపాలి.
స్టవ్‌ను తక్కువ మంట మీద పెట్టి బీట్ చేసిన పెరుగు వేసి నిండుగా కలపాలి. పెరుగు కడ్డిపడకుండా ఉండాలంటే ఈ స్టెప్ లో మంట చాలా తక్కువగా ఉండాలి.
ఇప్పుడు మిరపకారం, జీలకర్రపొడి, ధనియాలపొడి వేసి నూనె పైకి తేలేవరకు బాగా వేయించాలి. ఇదే కుర్మాకు అసలు రంగు, వాసన ఇచ్చే స్టేజ్.
ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలను వేయించి మసాలాలతో బాగా కలపాలి.
ఒక గ్లాస్ నీళ్లు పోసి గ్రేవీ మెల్లగా చిక్కబడే వరకు ఉడికించాలి.
చివరిగా గరం మసాలా, కసూరి మేతి వేసి ఇంకో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.
కొత్తిమీర తరుగు వేసి కలిపేస్తే సువాసనలతో నిండిన హోటల్ స్టైల్ ఆలూ కుర్మా రెడీ!
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
'వెయిట్ లాస్ సూప్'.. ఇలా చేసుకుని తాగితే వెయిట్ లాస్ గ్యారంటీ..!! -
వేసవిలో ఏ సమయంలో రాగి జావ తాగాలి- ఇలా చేస్తే ఫుల్ ఎనర్జీ..!! -
శనగపప్పు పాయసం ఇలా చేస్తే ఎంత రుచిగా ఉంటుందంటే.. అసలే వదిలిపెట్టరు! -
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications