కుక్కర్ లో వంకాయ కర్రీ.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!
వంకాయ అంటేనే తెలుగువారి స్పెషల్ వంటకం. వంకాయ అంటే ఇష్టపడని వారుండరు. వంకాయ కర్రీని ఎలా చేసినా లొట్టలేసుకుంటూ తింటారు. అయితే చాలామంది గుత్తొంకాయ కర్రీ, వేపుడు, పులుసు అంటూ ఎన్నో రకాల వెరైటీలు ట్రై చేస్తుంటారు. అలాగే వంకాయ టమాటా కర్రీ కూడా చాలామంది ఇష్టంగా తింటుంటారు. మరి ఈ కర్రీని కుక్కర్ లో ఎప్పుడైనా చేశారా..? కుక్కర్ లో చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి మాత్రమే కాకుండా చపాతీ, రోటీల్లోకి కూడా బాగానే ఉంటుంది.
మరి కుక్కర్ స్టైల్ వంకాయ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. వంకాయలు పావుకిలో, టమాటోలు ఐదు లేక ఆరు, ఉల్లిపాయలు చిన్నవి రెండు లేదా మూడు, నూనె తగినంత, పోపు దినుసులు ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ లు, అల్లం పేస్టు కొద్దిగా, కరివేపాకు ఒకటి లేదా రెండు కమ్మలు, ఇంగువ కొద్దిగా, ఉప్పు, కారం రుచికి తగినంత, ధనియాల పొడి కొద్దిగా, పసుపు కొద్దిగా, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.
కుక్కర్ స్టైల్ వంకాయ కర్రీ తయారీ విధానం చూస్తే.. ముందుగా వంకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వాటిని ఉప్పు నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ, టమాటోలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు వేయాలి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో ఇంగువ, అల్లం పేస్టు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఇప్పుడు అందులో టమాటో ముక్కలు వేయాలి. అవి మగ్గిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మసాలా మిశ్రమం మొత్తం ఆ ముక్కలకు పట్టేలా వాటిని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో తగినన్ని నీళ్లు పోసి కలిపి మూతపెట్టి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. వంకాయ ముక్కలు మంచిగా ఉడికాయనుకున్నాక కుక్కర్ లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి చివర్లో కొత్తిమీర తరుగు వేసుకుని కలిపి సర్వింగ్ చేసుకుంటే చాలు.












Click it and Unblock the Notifications