పుల్లకంద పులుసు.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్!
నిత్యం మన ఆహారంలో కూరలే కాదు పులుసులు కూడా ఒక ఫుడ్ ఎమోషన్. అటువంటి పులుసులలో పుల్లకంద పులుసు అనేది ఆంధ్ర, తెలంగాణ ఇళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందిన సాంప్రదాయ వంటకం. పుల్ల కంద, చింతపండుతో తయారయ్యే ఈ పులుసు తినటానికి చాలా బాగుంటుంది. సాధారణంగా చాలా మంది సాధారణ పద్ధతిలోనే చేస్తారు కానీ కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే రుచి పూర్తిగా మారిపోతుంది. ఇలా చేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది.
కావలసిన పదార్ధాలు
పుల్లకంద- పావు కిలో కట్ చేసుకున్న ముక్కలు
ఉల్లిపాయలు -2 కట్ చేసుకున్న ముక్కలు
పచ్చి మిరపకాయలు - 4 కట్ చేసుకున్నవి
చింతపండు - ఒక నిమ్మకాయ అంత
జీలకర్ర మెంతుల పొడి - ఒక స్పూన్
ధనియాల పొడి - ఒక స్పూన్
ఉప్పు- ఒకటిన్నర స్పూన్
కారం - ఒకటిన్నర సూపన్
పసుపు- పావు స్పూన్
నూనె - 3 టేబుల్ స్పూన్స్
పోపు గింజలు - 1 స్పూన్
ఎండుమిర్చి -2

పుల్ల కంద పులుసు తయారీ విధానం
ముందుగా పదార్థాలు సిద్ధం చేసుకోండి. చింతపండు నానబెట్టి పులుసు తీసుకోండి. ఉల్లిపాయలు, పచ్చి మిరపకాయలు, పుల్లకందను . ముక్కలుగా కట్ చేసుకుని పెట్టండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టి మూడు స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి, పుల్ల కంద ముక్కలు వేసి బాగా కలుపుకొండి.
ఇలా చేస్తే స్వర్గానికి బెత్తెడే దూరం
ఆపై అందులో కొద్దిగా పసుపు, ఒక స్పూన్ న్నర కారం, ఒక స్పూన్ న్నర ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఆపై అందులో చింతపండు పులుసు పోసి అందులో ఒక స్పూన్ జీలకర్ర, మెంతుల పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకుని పులుసు మగరనివ్వండి. అంతే రుచికరమైన పుల్ల కంద పులుసు రెడీ అవుతుంది. ఈ పులుసును అన్నంలో వేసుకుని తింటే స్వర్గానికి బెత్తెడే దూరం అన్నట్టు ఉంటుంది.













Click it and Unblock the Notifications