Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ ఒక్కమొక్క ఇంట్లో ఉంటే.. సర్వరోగాలు మాయం!

మనం పిచ్చి మొక్కలు అని భావించే అనేక మొక్కలలో ఎన్నో ఔషధ మొక్కలు ఉంటాయని మీకు తెలుసా? అలాంటి మొక్కల గురించి తెలుసుకుంటే చాలా రోగాల నుండి మనకు అలోపతి మెడిసిన్ తో కాకుండా సహజ సిద్ధమైన మందులతో ఉపశమనం దొరుకుతుంది. మనకు ఆరోగ్యానిచ్చే మనలో చాలా మందికి తెలీని గొప్ప ఔషధ మొక్క రణపాల.

150 రోగాలకు రణపాల దివ్యౌషధం
రణపాల మొక్క ఆకులు కాస్త మందంగా ఉంటాయి. తింటే వ‌గ‌రు, పులుపుగా అనిపిస్తాయి.ఈ మొక్క ఆకు ద్వారానే ప్ర‌త్యుత్ప‌త్తిని కొన‌సాగిస్తుంది. ఈ మొక్క ఆకుల‌ను నాటితే చాలు మళ్ళీ ఇంకో మొక్క మొలుస్తుంది.ఈ మొక్కను ఇంటి ఆవ‌ర‌ణ‌లో సుల‌భంగా పెంచుకోవ‌చ్చు. 150 రోగాలకు రణపాల దివ్యౌషధం. ర‌ణ‌పాల ఆకులు మూత్ర పిండాల స‌మ‌స్య‌లు, మూత్ర పిండాల రాళ్ళు ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి.

ranapala health benefits kidney stone plant cures 150 diseases

మూత్రపిండాల ఆరోగ్యానికి రణపాల బెస్ట్
ఈ ఆకుల‌ను రోజూ ఉద‌యం, సాయంత్రం రెండు చొప్పున తినాలని ఆయుర్వేద వైద్యులు చెప్తున్నారు. ఉద‌యం ఆకుల క‌షాయాన్ని 30 ఎంఎల్ మోతాదులో తాగ‌వ‌చ్చునని చెప్తున్నారు. దీంతో మూత్రపిండాలు , బ్లాడ‌ర్‌లో ఉండే రాళ్ళు క‌రిగిపోతాయి.ర‌ణ‌పాల ఆకుల‌ను తింటే ర‌క్తంలోని క్రియాటిన్ లెవ‌ల్స్ కూడా త‌గ్గుతాయి. ఇది డ‌యాలసిస్ రోగుల‌కు మేలు చేస్తుంది. మూత్ర‌పిండాల ప‌నితీరు మెరుగు ప‌డుతుంది.

డయాబెటిస్, అల్సర్స్ ఒకటేమిటి
రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకులను 2 చొప్పున తింటుంటే డ‌యాబెటిస్ త‌గ్గుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ బాగా అదుపులో ఉంటాయి. ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం మన జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. జీర్ణాశ‌యంలోని అల్స‌ర్లు త‌గ్గుతాయి. అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చుజ‌లుబు, ద‌గ్గు, విరేచ‌నాల‌ను న‌యం చేసే గుణాలు ఈ ఆకుల్లో ఉంటాయి. ఈ ఆకుల్లో యాంటీ పైరెటిక్ ల‌క్ష‌ణాలు ఉంటాయి.

హైబీపీ కంట్రోల్, గుండెకు మంచిది
ర‌ణ‌పాల ఆకుల ర‌సం ఒక్క చుక్క‌ను చెవిలో వేస్తే చెవిపోటు త‌గ్గుతుంది.ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి నుదుటిపై ప‌ట్టీలా వేసుకుంటే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది మ‌లేరియా, టైఫాయిడ్ జ్వ‌రాలు వ‌చ్చిన వారు రణపాల ఆకులు తింటే మంచిది. ర‌ణ‌పాల ఆకుల‌ను తిన‌డం వల్ల హైబీపీ కూడా కంట్రోల్ అవుతుంది. రణపాల తో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రణపాలతో జుట్టు సమస్యలకు చెక్
మూత్రంలో ర‌క్తం, చీము వంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.రణపాల ఆకుల‌ను తింటే జుట్టు రాల‌డం త‌గ్గుతుంద‌ది. తెల్ల వెంట్రుక‌లు రావ‌డం ఆగుతుంది.కామెర్లతో బాదపడే వారు రోజూ ఉద‌యం, సాయంత్రం ఈ ఆకుల ర‌సాన్ని 30 ఎంఎల్ మోతాదులో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ర‌ణ‌పాల ఆకుల‌ను పేస్ట్‌లా చేసి క‌ట్టు క‌డుతుంటే కొవ్వు గ‌డ్డ‌లు, వేడి కురుపులు పోతాయి.

ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రణపాల
శ‌రీరంలో వాపులు త‌గ్గుతాయి. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రణపాలను మీ ఇంట్లో పెంచుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అయితే రణపాల వైద్యం చేసుకోవాలనుకునేవారు రణపాల వినియోగంపై ఆయుర్వేద వైద్యులను సంప్రదిస్తే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+