Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

స్లిమ్ గా, చర్మం మృదువుగా.. పచ్చి అరటితో మీ అందం ఇనుమడించేనుగా!

ప్రకృతి మనకు ఇచ్చిన ఆహారాలలో పచ్చి అరటికాయ కూడా ఒకటి. పచ్చి అరటికాయతో బోలెడన్ని ప్రయోజనాలు ఉంటాయి. పచ్చి అరటికాయలో ఉండే పోషకాలు మనకు బాగా మేలు చేస్తాయి. చిన్నపిల్లలు అరటి పండ్లు అంటే బాగా ఇష్టపడతారు కానీ పచ్చి అరటికాయలలో మెగ్నీషియం, కాల్షియంతో పాటు మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి పిల్లలకు అరటికాయలను తినిపించడం వలన లేత వయస్సులోనే ఎముకలు దృఢంగా మారుతాయి.

పచ్చి అరటికాయలతో బోలెడు లాభాలు
పచ్చి అరటికాయలో గ్లూకోజ్ పరిమాణం తక్కువగా ఉంటుంది ఈ కారణంగా రక్తంలో చక్కెర పెరిగే ప్రమాదం వుండదు. మీరు డయాబెటికి పేషంటు అయితే పచ్చి అరటికాయను తింటే మంచిది. పండిన అరటి పండు కంటే పచ్చి అరటికాయలను తింటే మీ చర్మం పొడి బారకుండా మృదువుగా నిగనిగలాడుతుంది. అంతే కాదు పచ్చి అరటికాయను నిత్యం మన డైట్ లో చేర్చినట్లయితే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

Raw banana gives many health benefits along with weightloss and skin glow

చెడు కొవ్వు తగ్గటమే కాదు ఈ ప్రయోజనాలు కూడా
ముఖ్యంగా శరీరంలో చెడు కొవ్వును కరిగించే విధంగా పచ్చి అరటికాయ దోహదపడుతుంది.. మల బద్దకంతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలుగుతుంది
ఒంట్లో వేడి ఎక్కువగా ఉండే వారికి నోటిలో పొక్కులు రావడం, దంతాల నుండి రక్తం కారడం లాంటివి చూస్తుంటాము .ఈ సమస్యలు ఉన్నవారికి పచ్చి అరటి కాయ మేలు చేస్తుంది
పచ్చి అరటికాయను కూరగానూ, పచ్చడి రూపంలోనూ ఏదో ఒకరకంగా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

కీళ్ళ వాపులకు, అలెర్జీలకు పచ్చి అరటికాయ
కొద్దిగా ఏజ్ మీద పడిన వాళ్ళు , మధ్య వయసు ఉన్నవారు కీళ్ల నొప్పుల సమస్యలతో అనేక బాధపడుతున్న వారు రోజు పచ్చి అరటికాయ ఆహారంలో భాగంగా తింటే ఎలాంటి మందులు వాడకపోయినా కీళ్ల నొప్పుల సమస్యలకు చెక్ పెట్టవచ్చు.. డస్ట్ అలర్జీ ఉన్నవారికి, స్మెల్ అలర్జీ ఉన్నవారికి, యూరిన్ కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి కూడా పచ్చి అరటికాయ మేలు చేస్తుంది.

పచ్చి అరటికాయతో యవ్వనంగా
పచ్చి అరటికాయ మన జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. కడుపులో యాసిడిటీ, కడుపునొప్పి, అజీర్తి, పుల్లటి తెన్పులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. పచ్చి అరటికాయ బరువు తగ్గటానికి బాగా ఉపయోగపడుతుంది. మన చర్మాన్ని యవ్వనంగా ఉంచటానికి కూడా ఉపయోగపడుతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+