శృంగారం... ఆరోగ్యానికి ఎంతో మేలు!
మనిషి ఆరోగ్యం మీద శృంగారం ప్రభావాన్ని వర్ణించి చెప్పలేము. ఎవరు నమ్మినా నమ్మకపోయినా శృంగారం లేకపోవడంవల్ల మతిమరుపు రావడం, రక్తపోటు పెరగడంతోపాటు నిద్ర కూడా అస్తవ్యస్తమవుతుంది. అసలు శృంగారం వల్ల మనిషి లభించే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం.!
* గుండెకు హుషారు: శృంగారం గుండె ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. నెలలో ఒకసారి లేదంటే అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనేవారికి గుండెజబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారు వీరికన్నా ఆరోగ్యంగా ఉన్నారు.

* వ్యాయామం: వేగంగా మనిషి నడిచినప్పుడు నిముషానికి 6కేలరీలు ఖర్చవుతాయి. తోట పనిచేసేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు మన శరీరం ఎంత ఆక్సిజన్ తీసుకుంటుందో శృంగారంలో పాల్గొన్నప్పుడు అంతే ఆక్సిజన్ తీసుకుంటుంది. శృంగారంలో పాల్గొనేవారు ఇతర వ్యాయామాలు చేయడంలో కూడా ఆసక్తి చూపిస్తారు.
* జ్ఞాపకశక్తి మెరుగు: మెదడు చురుగ్గా పనిచేయడంతోపాటు జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తున్నట్టు పలు అధ్యయనాలు తెలిపాయి. ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు దాటినవారిలో మరింత ప్రభావం చూపిస్తోంది.
* రక్తపోటు అదుపు: శృంగారంతో రక్తపోటు అదుపులో ఉండే అవకాశముంది. ఎందుకంటే శృంగారం ఒకరకమైన ఏరోబిక్, కండరాలను వృద్ధి చేసే వ్యాయామాల మాదిరి ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆందోళనను తగ్గించి, హాయి భావన కలిగిస్తుంది. ఇవి రెండూ రక్తపోటు పెరగకుండా చూసేవే.
* రోగనిరోధక వ్యవస్థ బలోపేతం: శృంగారంలో పాల్గొననివారితో పోలిస్తే వారానికి రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో రోగనిరోధకశక్తి బలంగా ఉంటోంది.
* కంటి నిండా నిద్ర: భావప్రాప్తి పొందినప్పుడు ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. దీన్ని 'ప్రేమ' హార్మోన్ అని పిలుస్తారు. భాగస్వాముల మధ్య ప్రేమానురాగాలను పుట్టించి, అనుబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. శృంగార వేళల్లో హాయి అనిపించే భావన తో కూడిన ఎండార్ఫిన్లు పుట్టుకొస్తాయి. ఈ రెండింటి కలయిక మనిషికి మంచి నిద్రను కలిగిస్తుంది.
* బంధం బలోపేతం: శృంగారంలో పాల్గొన్న ఉత్సాహ ప్రభావం రెండు రోజుల వరకు ఉంటుంది. ఇలా ఉండటంవల్ల భాగస్వామితో దీర్ఘకాల అనుబంధానికి పునాది పడుతుంది. వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే దంపతులు.. పాల్గొననివారితో పోలిస్తే చాలా ఆనందంగా ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి.
* ప్రోస్టేట్‌కు రక్షణ: మగవారిలో ప్రోస్టేట్ గ్రంథి ఆరోగ్యంగా ఉండటానికీ శృంగారం దోహదం చేస్తుంది.
* ఆందోళన తగ్గుముఖం: మానసిక ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి తోడ్పడుతుంది. ఒత్తిడికి శరీరం స్పందించే సమయంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదులు శృంగారంతో తగ్గుతున్నట్టు అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.
* నొప్పుల నుంచి ఉపశమనం: నొప్పులు, బాధల నుంచి దృష్టిని మరల్చటానికి శృంగారం మంచి సాధనం. ఎండార్ఫిన్లు తలనొప్పి, వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులను కలిగిస్తుంది.
* భవిష్యత్ సమస్యల నివారణ: వారానికి ఒకటి కన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే కనీసం వారానికోసారైనా శృంగారం నెరిపే మగవారికి స్తంభనలోపం ముప్పు రెండు రెట్లు తక్కువగా ఉంటున్నట్టు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.
-
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!!












Click it and Unblock the Notifications