సబ్జా గింజలే కదా.. అనుకోవద్దు.. ఊహించని ప్రయోజనాలు

ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ అందరికీ పెరుగుతోంది. కొంతమంది బరువు తగ్గడానికి సబ్జా గింజలను ఉపయోగిస్తుంటారు. పానీయాలు, సలాడ్లు, ఇతర ఆహార పదార్థాలతోపాటు కలిపి వీటిని తీసుకుంటుంటారు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ ప్రభావాల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అయితే కొన్ని ప్రతికూల గుణాలను కూడా ఇవి కలిగివుంటాయి.

షుగరు వ్యాధి ఉన్నవారు పొరపాటున కూడా సబ్జా గింజలు తినకూడదు. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడానికి మందులు వాడుతుంటారు. సబ్జా గింజలు ఈ మందులకు ప్రతిస్పందించే గుణాలను కలిగివుండటంవల్ల శరీరానికి హాని జరుగుతుంది. సబ్జాగింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి రక్తాన్ని పలుచగా చేయడంవల్ల రక్తం గడ్డకట్టే ప్రక్రియ నెమ్మదిస్తుంది.

sabja

సబ్జా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. రోజుకు 4 నుంచి 5 సార్లు తీసుకుంటే అజీర్ణ సమస్యలు ఏర్పడతాయి. వీటిల్లో పీచుఎక్కువగా ఉండి త్వరగా జీర్ణం కావు. ఇటువంటి పరిస్థితుల్లో జీర్ణవ్యవస్థ గందరగోళంగా మారుతుంది.

శరీరాన్ని వేడి నుంచి రక్షించడంలో వీటిది కీలకపాత్ర. అంతేకాదు.. మెరుగైన ఆరోగ్యాన్నిస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. డీహైడ్రేషన్, శ్వాసకోశ వ్యాధులు, మలబద్ధకం లాంటివాటికి సబ్జా గింజలు మంచి ఔషధంగా పనిచేస్తాయి.

కొబ్బరి నూనెలో సబ్జా గింజల పిండిని కలిపి రాయడంవల్ల సోరియాసిస్, ఎగ్జిమా వంటి వ్యాధులను నయం చేస్తుంది.

సబ్జా గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల కొత్త చర్మ కణాలకు అవసరమైన కొల్లాజెన్ స్రవిస్తుంది.

సబ్జా గింజల్లో ఉండే యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు కండరాల సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కండరాలకు విశ్రాంతినిస్తాయి.

కోరింత దగ్గును నియంత్రించడానికి మంచి ఔషధంగా సబ్జా గింజలు పనిచేస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+