పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడుతున్న వారికి హెచ్చరిక!

చాలామంది పెయిన్ కిల్లర్స్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఏ చిన్నపాటి నొప్పి కలిగిన వెంటనే ఒక టాబ్లెట్ వేసేస్తూ ఉంటారు. అయితే పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల అనేక రకాల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో ఏ భాగంలో నొప్పి అనిపించినా ఆ నొప్పిని తగ్గించడానికి పెయిన్ కిల్లర్స్ బాగా పనిచేస్తాయి.

పెయిన్ కిల్లర్స్ ఉపయోగించేవారి ఆరోగ్యం ప్రమాదంలో
అయితే కొద్దిపాటి నొప్పి కలిగినప్పటికీ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఏ మాత్రం మంచిది కాదు. అలాగే పెయిన్ కిల్లర్స్ ను వైద్యుల సలహా లేకుండా వాడడం కూడా మంచిది కాదు. విపరీతంగా పెయిన్ కిల్లర్స్ ఉపయోగించేవారు వారికి తెలియకుండానే వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటారు అన్న విషయాన్ని వైద్యులు పదేపదే చెబుతున్నారు.

serious health problems warning to those who are overusing pain killers

పెయిన్ కిల్లర్స్ తో తీవ్ర అనారోగ్య సమస్యలు
పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ అతిగా తీసుకునే వారికి కడుపులో చిరాకు కలుగుతుందని, అల్సర్లు వచ్చే అవకాశం ఉందని, అంతర్గత రక్తస్రావం కూడా జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు ఎక్కువ కాలం పాటు పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కిడ్నీలు కూడా దెబ్బ తినే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

పెయిన్ కిల్లర్స్ తో లివర్ ఫెయిల్యూర్ కూడా
పెయిన్ కిల్లర్స్ మన శరీరంలోని వివిధ అవయవాల మీద ప్రతికూలంగా ప్రభావాన్ని చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వినియోగించే వారిలో శరీరంలో రక్తప్రసరణ సరిగా జరగదని ఫలితంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని సూచిస్తున్నారు. మితిమీరిన పెయిన్ కిల్లర్స్ వాడకం కాలేయ సమస్యలను కలిగిస్తుందని, ఒక్కోసారి ఇది లివర్ ఫెయిల్యూర్ కు కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.

పెయిన్ కిల్లర్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్త
విపరీతంగా పెయిన్ కిల్లర్స్ వాడేవారిలో కొందరిలో తలనొప్పి వస్తుందని, ఈ రకమైన తలనొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎప్పుడైనా వెంట వెంటనే పెయిన్ కిల్లర్ ను తీసుకోకూడదని వైద్యుల సలహా మేరకు పెయిన్ కిల్లర్స్ తీసుకుంటున్న వారు కూడా ఖచ్చితంగా పెయిన్ కిల్లర్స్ వాడడంలో నాలుగైదు గంటల తేడాతో తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సహజమార్గాలతో నొప్పులు తగ్గించుకుంటేనే మంచిది
మన శరీరంలో ఏ భాగమైనా నొప్పికి అసౌకర్యానికి గురైతే ఆ అసౌకర్యాన్ని నొప్పిని తగ్గించుకోవడానికి సహజమార్గాలనే అనుసరించాలని తొందరపడి మందులు వేసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. మరి చిన్న నొప్పి కలిగినా పెయిన్ కిల్లర్స్ వాడేవారు ఈ విషయాలను తెలుసుకొని పెయిన్ కిల్లర్స్ వినియోగంలో జాగ్రత్తలు వహించండి. లేదంటే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+