వణికే చలిలో ఫ్రీజింగ్ కీళ్ళనొప్పులా? తగ్గాలంటే బెస్ట్ టిప్స్ ఇవే!

చలికాలం వచ్చింది. చలికాలంలో చాలా మంది కీళ్ళ నొప్పులతో బాధ పడుతూ ఉంటారు. ఉదయం నిద్ర లేచే సరికి కనీసం నడవలేని స్థితికి కూడా వెళ్తూ ఉంటారు. కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులతో బాధపడే వారి సంఖ్య ఈ సీజన్ లో విపరీతంగా ఉంటుంది. కీళ్లు గట్టి పడిపోవడం, జాయింట్లు సహకరించకపోవడంతో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు.

విటమిన్ డీ సప్లిమెంట్ తో కీళ్ళ నొప్పులకు చెక్
ఇక అలాంటి వారు కొన్ని చిన్న చిట్కాలతో ఈ నొప్పులు, బాధల నుండి ఉపశమనం పొందవచ్చు. చలికాలంలో చాలా మందికి విటమిన్ డీ లోపం వస్తుంది. సూర్య రశ్మి శరీరానికి తగలక విటమిన్ డీ లోపం ఏర్పడుతుంది. ఈ విటమిన్ డీ లోపాన్ని నివారించటం కోసం విటమిన్ డీ సప్లిమెంట్ తీసుకోవటం ఎంతో మంచిది. దీనివలన విటమిన్ డీ లోపం తగ్గి నొప్పులు తగ్గుతాయి.

Severe arthritis Freezing body in winter Here are the best tips to reduce it

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఇది తప్పనిసరి
చలికాలం కీళ్ళ నొప్పులతో బాధపడేవారు శరీరాన్ని హైడ్రేటెడ్ గా చూసుకోవాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా తగిన నీళ్ళు తాగాలి. చలికాలం మనకు తెలీకుండానే తక్కువ నీళ్ళు తాగుతామని, ఫలితంగా బాడీ డీ హైడ్రేట్ అవుతుందని చెప్తున్నారు. ఫలితంగా కీళ్ళనొప్పుల సమస్య వస్తుందని అంటున్నారు. కనుక శరీరం హైడ్రేటెడ్ గా ఉంటే కీళ్ళ నొప్పులు కాస్త తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు.

వేడిగా ఉంటేనే మంచి రిజల్ట్స్
చలికాలం చలికి శరీరంలో నొప్పులు, వాపులు బాధిస్తాయి. ముఖ్యంగా కీళ్ళ వాతం ఉన్నవారికి చలి కారణంగా ఫ్రీజింగ్ సెన్సేషన్ వస్తుంది. కనుక శరీరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వేడి కాపడం పెట్టుకుంటే కూడా కీళ్ళ నొప్పుల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది.

కీళ్ళ నొప్పులు తగ్గాలంటే సమతుల ఆహారం
ఇక కీళ్ళ నొప్పులు బాగా బాధిస్తున్న వారు ఈ శీతాకాలంలో సల్ఫర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తినాలి. అలాగే క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారాలు తినాలి.కీళ్ళ నొప్పులు బాధించేవారు సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అప్పుడు మన శరీరానికి కావాల్సిన పోషకాలు సంవృద్దిగా అంది కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక ఆహారంలో ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్, టమాటాలు, క్యాబేజీ, బచ్చలికూర వంటివి ఆహారంలో భాగంగా చేసుకుంటే కీళ్ళ వాతం నుండి రిలీఫ్ వస్తుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+