చలికాలంలో చర్మం పొడిబారుతుందా? ఖర్చులేని ఈ చిట్కాలు ట్రై చెయ్యండి!!
చలికాలంలో మన చర్మం విపరీతంగా పాడైపోతుంది. ప్రస్తుతం చలి విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో విపరీతమైన చలి దెబ్బకు చర్మం తన సున్నితత్వాన్ని కోల్పోయి రఫ్ గా తయారవుతుంది. పొడిబారినట్లు మారుతుంది. ఒక్కోసారి మనల్ని మనం చూసుకోడానికి కూడా అసహ్యంగా అనిపిస్తుంది. అంతగా చర్మం పాడైపోతుంది. అయితే చలికాలం చర్మ సంరక్షణపై దృష్టి సారించాలి.
చర్మ సంరక్షణా శ్రద్ధ లేకుంటే కచ్చితంగా అందవిహీనంగా తయారవుతాము. అందుకే చలికాలం చర్మ రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇక్కడ తెలుసుకుందాం. చలికాలంలో ఎక్కువగా చర్మం పొడిబారిపోయి ఉంటుంది. ఈ పొడిబారిన చర్మాన్ని కాపాడుకోవడానికి మార్కెట్లో అనేక క్రిములు, ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అవి చాలా డబ్బుల ఖర్చుకు కారణం అవుతాయి.

అలాంటప్పుడు వాటిని కొనుగోలు చేయలేని వారు కొబ్బరి నూనెను చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. పాలలోని మీగడను, వెన్నను, నెయ్యిని కూడా శరీరానికి, అప్లై చేసుకోవచ్చని, తద్వారా చర్మం పొడిబారడం తగ్గుతుంది అని, శరీరం మృదువుగా మారుతుంది అని చెబుతున్నారు.
ఇక చలికాలం శరీరానికి కావలసినంత నీటిని తాగకపోవడం కూడా చర్మం పొడి బారటానికి కారణంగా చెబుతారు. వాతావరణం చల్లగా ఉంటే మనం సాధారణంగానే తక్కువ నీటిని త్రాగుతాం. కాబట్టి శరీరం డీ హైడ్రేడ్ అయ్యి చర్మం పొడి బారటానికి ఒక కారణంగా మారుతుంది. అందుకే చలికాలం నీటిని తాగడం పైన కూడా శ్రద్ధ వహించాలి. నిత్యం నాలుగు నుండి ఐదు లీటర్ల నీటిని కనీసం తాగాలని వైద్యులు చెబుతున్నారు.
శరీరానికి కావలసినంత నీటిని తాగడం, సరైన పౌష్టికాహారాన్ని తీసుకోవడం వల్ల చర్మాన్ని సంరక్షించుకోవచ్చు. ఇక చలికాలంలో విటమిన్ డీ లోపం ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డీ లోపం వల్ల కూడా ఒక్కొక్కరిలో చర్మ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక ఇటువంటి వారు ఉదయం సూర్యరశ్మి తగిలేలా శరీరాన్ని చూసుకోవాలి.
అది సాధ్యం కాకపోతే విటమిన్ డీ త్రీ టాబ్లెట్ లను వైద్యుల సూచనల మేరకు ఉపయోగించాలని చెబుతున్నారు. కనుక చలికాలం చర్మం విషయంలో మిగతా సీజన్ల కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహా భాగ్యం, అది శరీర భాగాలైనా , చర్మమైనా సరే .. ఆరోగ్యంగా ఉంటేనే మనం మన పనులు చేసుకోగలుగుతాం.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications