సొరకాయ ముక్కలే కాదు తొక్కలు కలిపి పచ్చడి ..రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం!

సొరకాయ ముక్కలే కాదు తొక్కలతో కూడా పచ్చడి చేయవచ్చు. సొరకాయ ముక్కలు, తొక్కలు కలిపి పచ్చడి చేయడం కేవలం రుచి కోసం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరి సొరకాయ ముక్కలు, తొక్కల పచ్చడి ఏవిధంగా తయారు చేయాలి. దీనివల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ప్రస్తుతం తెలుసుకుందాం.

సొరకాయ ముక్కలు తొక్కల పచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు
సొరకాయ ముక్కలు, తొక్కలు- ఒక చిన్నది
పచ్చిమిరపకాయలు- 20
ఉప్పు- రెండు స్పూన్లు రుచికి తగినంత
జీలకర్ర- రెండు స్పూన్లు
వెల్లి పాయలు- పది రెబ్బలు
కరివేపాకు- రెండు రెమ్మలు
నూనె- మూడు స్పూన్లు
చింతపండు- ఉసిరికాయంత

sorakaya mukkalu tokkala pachadi many health benefits with bottle gourd pachadi

తయారీ విధానం
స్టవ్ పైన పాన్ పెట్టి మూడు స్పూన్ల నూనె పోసుకుని సొరకాయ చెక్కు తీసి, తొక్కను కూడా ముక్కలుగా కట్ చేసి, సొరకాయ, తొక్కలు ముక్కలు కలిపి, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ముక్కలను చల్లారనిచ్చి మిక్సీలో కానీ రోట్లో కానీ వేసుకొని రుబ్బుకోవాలి.

సొరకాయ ముక్కలు, తొక్కల పచ్చడితో ఆరోగ్యం
చల్లారిపోయిన ఈ మొత్తం ముక్కలను మిక్సీ జార్లో వేసి, రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల జీలకర్ర, రెండు రెమ్మల కరివేపాకు, పదిరెబ్బలు వెల్లిపాయలు వేసి మిక్సీ చేసుకోవాలి. ఇష్టాన్ని బట్టి పోపు చేసుకోవచ్చు.. లేదా నేరుగా తినవచ్చు. ఈ పచ్చడిని అన్నంలో కానీ, టిఫిన్స్ లో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయ ముక్కలు, తొక్కలు కలిపి చేయడం వల్ల ఇది ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది..

సొరకాయ ముక్కలు, తొక్కలు పచ్చడితో బెనిఫిట్స్ ఇవే
సొరకాయ ముక్కలు, తొక్కలు పచ్చడితో మన శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. తొక్కలో ఫైబర్ ఉండటం వల్ల, ఈ పీచు పదార్థం మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారించి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో విటమిన్ సి, విటమిన్ కె మరియు విటమిన్ బి ఉండడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

దీర్ఘ కాలిక రోగాల నుండి విముక్తి
సొరకాయ ముక్కలు, తొక్కల పచ్చడితో ఎముకల ఆరోగ్యం పెరుగుతుంది. సొరకాయ తొక్కలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించి మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు దోహదం చేస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+