కేవలం ఇది తిని 10కిలోలు బరువు తగ్గిన స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్
నేను శైలజ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసిన కీర్తి సురేష్ మహానటి సినిమా తర్వాత స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం వరుస హిట్లర్ తో దూసుకుపోతున్న కీర్తి సురేష్ చాలా స్లిమ్ గా కనిపిస్తుంది. 2018 కి ముందు బొద్దుగుమ్మ లా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సన్నగా నాజుగ్గా తయారయింది.
బాగా బరువు తగ్గిన కీర్తి సురేష్
కీర్తి సురేష్ బరువు తగ్గడానికి ఏం చేసింది? ఎటువంటి డైట్ ను ఫాలో అయింది? కీర్తి సురేష్ 8 నెలలలోనే 10 కిలోల బరువు తగ్గడం వెనుక సీక్రెట్ ఏమిటి? వంటి వివరాలను తెలుసుకుందాం.సహజంగా హీరోయిన్స్ బరువు పెరగకుండా ఉండడానికి కఠినమైన డైట్ లను ఫాలో అవుతారు. ప్రతిరోజు జిమ్ కి వెళ్లడం, వ్యాయామాలు చేయడం, యోగా వంటివి చేయడంతోపాటు, ఆహారం విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారు.

ప్రతీరోజూ అలా చేసిన కీర్తి సురేష్
కీర్తి సురేష్ బరువు తగ్గడానికి ఏం చేశారు. ఎనిమిది నెలల్లో 10 కిలోల బరువు ఏవిధంగా తగ్గారు. ఏమైనా ట్రీట్మెంట్లు తీసుకున్నారా అంటే అలాంటిదేమీ లేదని చెబుతున్నారు. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోకుండానే ప్రతిరోజు యోగా చేయడం వల్ల తన బరువును కంట్రోల్లో ఉంచుకున్నాను అని పేర్కొన్నారు. అంతేకాకుండా టెన్నిస్ ప్రాక్టీస్ చేయడం , స్విమ్మింగ్ వంటివి చేయడం తనకు ప్లస్ అయ్యాయని తెలిపారు.
డైట్ ఫాలో కాలేదు కానీ
అంతేకాదు కీర్తి సురేష్ తను ఎప్పుడూ డైట్ ఫాలో అవ్వలేదని చెప్పారు. తనకు ఏది తినాలనిపిస్తే అది తింటాను అని చెప్పిన కీర్తి సురేష్ తన ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ ఉండేలా చూసుకుంటానని చెప్పారు. ప్రతిరోజు తను ప్రోటీన్ కోసం గుడ్లలోని తెల్లసొన మాత్రమే తినేదాన్ని అని వెల్లడించారు. ఇక ప్రోటీన్ కోసం పన్నీర్, సోయా, పప్పు ధాన్యాలు ఎక్కువగా తినేదాన్ని అని తెలిపారు.
కేవలం ఈ ఒక్క ఆహారమే బరువు తగ్గటానికి కారణం
కేవలం ప్రోటీన్ ఉన్న ఆహారంతోనే తన బరువు తగ్గానని కీర్తి సురేష్ వెల్లడించారు. మన శరీరానికి ఏది సూట్ అవుతుంది. ఏది తింటే మనకు సెట్ అవుతుంది అనేది తెలుసుకొని, తదనుగుణంగా తినాల్సిన అవసరం ఉంటుందని, అందరికీ ఒకే విధమైన ఆహారాలు సెట్ కావని కీర్తి సురేష్ పేర్కొన్నారు.
disclaimer: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications