ఎండాకాలం.. చల్లచల్లగా ఐస్ వేసిన జ్యూస్ లు తాగుతున్నారా? జాగ్రత్త!
ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో చల్లచల్లని కూల్ కూల్ గా ఉండే జ్యూసులు తాగడాన్ని చాలామంది ఇష్టపడుతుంటారు. ఇంట్లో జ్యూసులు తయారు చేసుకోలేని వారు, బయట జ్యూస్ పాయింట్ల మీద ఆధారపడుతుంటారు. అయితే జ్యూస్ పాయింట్స్ వద్ద తయారు చేసే జ్యూసులు ఏమాత్రం మంచిది కాదని, వాటిలో వినియోగించే ఐస్ తో కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రా ఐస్ వేసిన జ్యూస్ లతో అనారోగ్యాలు
సాధారణంగా మంచినీళ్లతో ఇంట్లో తయారు చేసుకునే ఐస్ క్యూబ్స్ బాగానే ఉంటాయి. కానీ బయట జ్యూస్ పాయింట్ల వద్ద దొరికే రా ఐస్ మాత్రం అనేక ఆరోగ్య ప్రమాదాలకు కారణమని చెప్పొచ్చు. దీనిని శుభ్రమైన నీళ్లతో తయారు చేయకపోవడం వల్ల, వీటిలో కలుషితాలు, మలినాలు ఉండే అవకాశం ఉంటుంది. రా ఐస్ లో హానికరమైన బ్యాక్టీరియా ఉండడంవల్ల ఇది అనేక రోగాలకు కారణమవుతుంది.

ఐస్ వేసిన జ్యూస్ లతో ఈ అనారోగ్య సమస్యలు
రా ఐస్ లో నోరో వైరస్, ఈకోలీ వంటి బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి వ్యాధి కారకాలుగా చెప్పవచ్చు. అయితే ఈ రా ఐస్ తో తయారు చేసిన జ్యూసులు తాగినప్పుడు జీర్ణ సంబంధితమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వాంతులు , విరోచనాలు, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా రావచ్చు.
బయట జ్యూస్ పాయింట్ల వద్ద జ్యూస్ తాగొద్దు
ఆస్తమా, బ్రాంకైటిస్, సైనస్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ రా ఐస్ తో తయారు చేసినటువంటి జ్యూసులు తాగకుండా ఉంటేనే మంచిది. విపరీతమైన ఎండల్లో తీవ్రమైన దాహంతో ఉన్నవాళ్లు జ్యూస్ పాయింట్స్ వద్దకు వెళ్లి చల్ల చల్లగా వేసిన ఐస్ తో ఉన్న జ్యూస్లను ఒకటికి రెండు గ్లాసులు తాగుతూ ఉంటారు. ఇది తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని, సాధ్యమైనంత వరకు బయట జ్యూస్ లు తాగకుండా ఉంటేనే మంచిదని చెబుతున్నారు. ఒక జ్యూస్ లు మాత్రమే కాదు బయట రా ఐస్ తో తయారు చేసిన ఏ పానీయాలను తాగకుండా ఉంటేనే మంచిదని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications