sun stroke: వడదెబ్బతో ప్రాణహాని; లక్షణాలివే.. తస్మాత్ జాగ్రత్త!!

తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. గత రికార్డులను తిరగరాస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు వడదెబ్బ కారణంగా మృత్యువాత పడ్డారు. వాతావరణ శాఖ అధికారులు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. వడదెబ్బ తగిలితే అది ఒక్కోసారి ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తుందని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

వడదెబ్బతో డేంజర్
విపరీతమైన ఎండల్లో ఎటువంటి జాగ్రత్తలు పాటించకుండా తిరిగితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే వ్యవస్థ బలహీన పడటంతో వడ దెబ్బ తగులుతుంది. అయితే వడదెబ్బ యొక్క లక్షణాలను తెలుసుకుంటే, తమకు వచ్చిన అనారోగ్య సమస్య వడదెబ్బతో వచ్చిందా, లేక ఇతరత్రా మరేదైనా కారణం ఉందా అన్నది అర్థమవుతుంది.

Sun stroke is very dangerous these are the symptoms be careful

వడదెబ్బ వలన ప్రభావితం అయ్యేవి ఇవే
వడదెబ్బ వల్ల సాధారణంగా మెదడు, గుండె, మూత్రపిండాలు, కండరాలు ప్రభావితం అవుతాయి. వడదెబ్బతో మానసిక స్థితిలో మార్పు వస్తుంది. వారిలో ఒత్తిడి కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయానికి గందరగోళానికి గురవుతారు. వారికి కోపం విపరీతంగా వస్తుంది. ఒక్కోసారి మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి మనిషి కోమాలోకి వెళ్లిపోయే పరిస్థితి కూడా ఉంటుంది.

వదదెబ్బతో కిడ్నీలు, లివర్ దెబ్బ తింటాయి
వడదెబ్బ తగిలిన వారు కండరాల నొప్పులు, తిమ్మిర్లు ఎదుర్కొంటారు. వడదెబ్బ కారణంగా గుండె లయ తప్పుతుంది. శరీరంలో ఉన్న శక్తి అంతా నిర్వీర్యం అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. వడదెబ్బ కారణంగా శరీరం డీహైడ్రేట్ అవుతుంది. శరీరానికి కావలసిన నీటి శాతాన్ని కోల్పోతుంది. వడదెబ్బ కారణంగా కళ్ళు మసకబారడం, శరీరంలోని కిడ్నీలు, లివర్ దెబ్బ తినడం చోటు చేసుకుంటాయి.

వాంతులు, విరేచనాలు, జ్వరం.. ఇంకా ఎన్నో
వడదెబ్బ ప్రభావం ఎక్కువగా ఉంటే వాంతులు, విరోచనాలు కూడా అవుతాయి. శరీర ఉష్ణోగ్రత బాగా పెరిగి జ్వరం వస్తుంది. దాహం ఎక్కువగా అనిపించడంతో పాటు, తల తిప్పేస్తుంది. ఇక 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులపైన, చిన్నపిల్లలపైన, గర్భిణీలు, బాలింతలపైన ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కూడా తీవ్రమైన ఎండలోకి వెళ్లకుండా ఉంటేనే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+