సూపర్ టేస్టీ 'దోసకాయ చికెన్'.. ఎలా తయారు చేసుకోవాలి..?
చికెన్ ను చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. చికెన్ ఏ విధంగా చేసినా టేస్టీగానే ఉంటుంది. అందువల్ల చికెన్ ను రకరకాలుగా చేసుకుంటారు. చికెన్ ను ఫ్రైలు, పులుసులు అలాగే గ్రేవీగా పెట్టుకుని తింటారు. అయితే ఎప్పటిలాగా కాకుండా దోసకాయ చికెన్ తయారు చేసుకుని ఎప్పుడైనా తిన్నారా..? మరి దోసకాయ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి..? వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి..?
దోసకాయ చికెన్ ను తయారు చేసుకోవడానికి గల పదార్థాలు ఓ సారి చూస్తే.. చికెన్(కేజీ),
నూనె (100 గ్రాములు), పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెండు,ధనియాలు తగినన్ని , దాల్చిన చెక్క, 5 లవంగాలు, ఒక పెద్ద దోసకాయ, గసగసాలు తగినన్ని,కొత్తిమీర తరుగు కొద్దిగా అలాగే కరివేపాకు కొంచెం తీసుకోవాలి.
ఇక దోసకాయ చికెన్ తయారీ విధానం ఓసారి చూస్తే.. ముందుగా చికెన్ ను కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోసకాయను మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకోవాలి. మిక్సీజార్ లో అల్లం, ఎండు కొబ్బరి కొద్దిగా, గసగసాలు వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె వేడెక్కాక అందులో పసుపు, కరివేపాకు వేసుకోవాలి. దాంట్లో చికెన్ వేసుకోవాలి.. చికెన్ మగ్గాక.. అందులో సరిపడా కారం, ఉప్పు వేసి మగ్గించాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమంలో చికెన్ మునిగే వరకూ నీళ్లు పోయాలి. బాగా కలపాలి. ఆ తర్వాత ముందే గ్రైండింగ్ చేసుకున్న అల్లం గసగసాల పేస్టును అందులో వేసి వేయించుకోవాలి. అలా ఉడికిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేయాలి. మరోసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ముక్కలు, దోసకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేయాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే దోసకాయ చికెన్ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications