బియ్యంపిండి, బెల్లం, పాలతో సూపర్ టేస్టీ స్వీట్.. ఈజీగా ఇలా చేసుకోండి!
చాలామంది స్వీట్లు తినడం ఇష్టపడతారు. స్వీట్ తినాలంటే బయట స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోవలసిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే మనం రకరకాల స్వీట్లు తయారు చేసుకొని తినవచ్చు. పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించి ఆరోగ్యకరమైన సీట్లను కూడా తయారు చేసుకోవచ్చు. ఈరోజు మనం బియ్యం పిండి, బెల్లం, పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ ఉపయోగించి చేసే ఒక సూపర్ స్వీట్ రెసిపీ ని తెలుసుకుందాం.
ఈ స్వీట్ తయారీ కి కావలసిన పదార్థాలు
బియ్యం పిండి ఒక కప్పు
తురిమిన బెల్లం ఒక కప్పు
పాలు రెండు కప్పులు
నీళ్లు అర కప్పు
నెయ్యి ఆరేడు స్పూన్లు
జీడిపప్పు 20
బాదంపప్పు 10
యాలుకల పొడి కొద్దిగా

తయారీ విధానాన్ని చూద్దాం
ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకుని తురిమిన కప్పు బెల్లాన్ని అరకప్పు నీళ్లు పోసి బాగా కరిగించాలి. బెల్లం చిక్కటి పాకం రానవసరం లేదు. బెల్లం మొత్తం కరిగిపోయి చేతి వేళ్లకు అంటుకునేలా చిక్క పడితే చాలు. ఆ తర్వాత బెల్లం లేత పాకాన్ని పక్కన పెట్టుకొని, స్టవ్ మీద పాన్ పెట్టి కప్పు బియ్యం పిండి తీసుకుని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో నిదానంగా వేయించుకోవాలి.
చిన్న మంట మీదే దీనిని తయారు చేసుకోవాలి
బియ్యం పిండి నాలుగైదు నిమిషాల పాటు వేగిన తర్వాత మూడు స్పూన్ల నెయ్యి వేసి మరో మూడు నిమిషాల పాటు సన్నని మంటపైన దానిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో రెండు కప్పుల కాచి చల్లార్చిన పాలు నిదానంగా పోస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి అలా ఉడుకుతూ ఉన్న బియ్యం పిండిలో లేతగా పట్టుకున్న బెల్లం పాకాన్ని పోయాలి. బాగా కలుపుతూ దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి.
జీడిపప్పు,బాదంపప్పు లతో ఎక్స్ ట్రా టేస్ట్
ఇందులో మధ్య మధ్యలో ఒక చెంచా నెయ్యి వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో పెట్టుకునే యాలుకల పొడిని కలుపుకోవాలి. పాన్ నుండి పిండి మిశ్రమం విడి పడేదాకా కలుపుకుని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక పాన్లో జీడిపప్పు, బాదంపప్పు నెయ్యిలో వేయించుకోవాలి. వేయించిన జీడిపప్పు, బాదంపప్పును మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి.
కొబ్బరి పొడిలో డిప్ చేసి స్టోర్ చేసుకోవటమే
ఆపై ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఈ మిశ్రమాన్ని పోసి, దాంట్లో దంచి పెట్టుకున్న బాదంపప్పు, జీడిపప్పును వేసి ఇష్టమైన షేప్ లో కట్ చేసుకుని కొబ్బరి పొడిలో డిప్ చేసి బాక్స్ లో స్టోర్ చేసుకుంటే రుచికరమైన స్వీట్ రెడీ అయినట్టే. చాలా సింపుల్ గా చేసుకోగలిగే ఈ స్వీట్ రుచి అద్భుతంగా ఉంటుంది.












Click it and Unblock the Notifications