Gallbladder: గాల్‌బ్లాడర్‌లో స్టోన్స్‌ ఎందుకు ఏర్పడతాయి..? సర్జరీ తప్పనిసరా..?

Gall Stones: శరీరంలోని వివిధ భాగాల్లో ఈమధ్య రాళ్లు తయారు కావడం కామన్ అయిపోయింది. మూత్రపిండాలు, పిత్తాశయంలో స్టోన్స్ ఫార్మ్ కావడం గురించి తరచుగా వినబడుతున్నాయి. మొదటగా చిన్నగా మొదలై క్రమేపీ వీటి సైజ్ పెరుగుతూ పోతుంది. తద్వారా ఆయా శరీర భాగాల్లో అసౌకర్యంతో పాటు తీవ్రమైననొప్పి కలుగుతుంది. అవసరమైతే పరిస్థితి శస్త్రచికిత్స వరకు దారితీసే అవకాశం ఉంది.

కొలెస్ట్రాల్ లేదా బిలిరుబిన్ స్థాయిలు పిత్తాశయంలో అధికంగా ఉన్నప్పుడు అక్కడ రాళ్లు ఏర్పడతాయి. వాటిని బయటకు పంపించడంలో పిత్తాశయం విఫలమయ్యే పక్షంలో అవి అక్కడే ఉండిపోయి సైజ్ పెరుగుతూ ఉంటాయి. తరచుగా అక్కడ రిలీజ్ అయ్యే కొలెస్ట్రాల్, కాల్షియం మరియి ఇతర ద్రవాల వల్ల రాళ్ల పరిమాణం మరియు కూర్పులో మార్పు ఉంటుంది.

Surgery is not mandatory for Stones in Gallbladder

గాల్ బ్లాడర్‌ లేదా పిత్తాశయంలో రాళ్ల సైజ్ పెద్దదైతే ఏకంగా ఆ భాగాన్ని సర్జరీ చేసి తీసివేయాలని వైద్యులు నిర్ణయిస్తారు. లాపరోస్కోపిక్ కోలిసిస్టెక్టమీగా పిలిచే ఈ చికిత్స.. నొప్పితో పాటు ఇతర ఆరోగ్య ప్రమాదాల నుంచి బయటపడేందుకు ఓ సురక్షితమైన ప్రక్రియగా చెప్పవచ్చు. అయితే ఈ సమస్యకు ఖచ్చితంగా శస్త్రచికిత్స అవసరం ఉంటుందని చెప్పలేము.

పిత్తాశయం వాపు, గాయం, దీర్ఘకాలిక మంట, క్యాన్సర్ లేదా సాధారణ కణితులు ఏర్పడిన సందర్భాల్లో వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి దాన్ని తొలగించాల్సి ఉంటుంది. అయితే దీన్ని నిర్ధారించేందుకు మందుగా కొన్ని పరీక్షలు లేదా ప్రక్రియలు జరపాల్సిన అవసరం ఉండవచ్చు. ఇన్ఫెక్షన్ లేదా కాలేయ సమస్యలను తనిఖీ చేసేందుకు రక్త పరీక్ష, చెస్ట్ అల్ట్రాసౌండ్, CT స్కాన్‌లను రిఫర్ చేయవచ్చు.

లాపరోస్కోపిక్ పద్ధతి ద్వారా సాధారణంగా పిత్తాశయం తొలగింపు చేపడతారు. ఇందులో ఒక సెంటీమీటర్ కంటే తక్కువ సైజ్‌లో చిన్న హోల్ చేస్తారు. తద్వారా తక్కువ నొప్పితో పాటు త్వరగా కోలుకుని సాధారణ రోజువారీ పనులు చేసుకోవచ్చు. చాలా మంది రోగులు సర్జరీ అనంతరం కేవలం 4-6 గంటలలోపు నడవగలరు. 24 నుంచి 48 గంటలలోపు డిశ్చార్జ్ కావచ్చు. ఓపెన్ సర్జరీ అనేది నేడు చాలా అరుదుగా జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+