టాయిలెట్ లోకి మొబైల్ పట్టుకెళ్తున్నారా? ప్రమాదం.. జాగ్రత్త!!

మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక అడిక్షన్ లా తయారైంది. మొబైల్ ఫోన్ లేకుండా ఎవరు ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ అనేది అత్యవసరంగా మారింది. ఒకగంట సేపు ఫోన్ లేకపోతే ఉండలేని పరిస్థితి వచ్చింది. అది ఎంతలా అంటే 24గంటలు ఫోన్ లోనే తలపెట్టి చూసేంత వ్యసనంగా, ఫోన్ లేకపోతే ప్రపంచ ఆగిపోతుందేమో అన్నంత అదిగా మొబైల్ ఫోన్ వ్యసనం పెరిగిపోయింది.

టాయిలెట్ లో ఫోన్ వాడుతున్నారా? అయితే డేంజర్
ఇక మొబైల్ ఫోన్ ను ఎక్కువగా వాడడం అలవాటు ఉన్నవారు చివరకు బాత్రూంలోకి వెళ్లేటప్పుడు కూడా మొబైల్ ఫోన్లను తీసుకువెళ్తుంటారు. టాయిలెట్లో ఫోన్ చూస్తూ గంటల సమయం బయటకు రాకుండా గడుపుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ప్రమాదాలు, సమస్యలు కొని తెచ్చుకున్నట్టు అవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Taking your mobile into the toilet Danger Be careful

టాయిలెట్ లో ఫోన్ వినియోగంతో రోగాలు ఖాయం
ఎవరైతే టాయిలెట్ కి వెళ్ళినప్పుడు మొబైల్ ఫోన్ తీసుకువెళ్లి ఫోన్లో చూస్తూ కూర్చుంటారో వారు ఖచ్చితంగా రోగాల బారిన పడతారని హెచ్చరిస్తున్నారు. టాయిలెట్లోకి ఫోన్ తీసుకు వెళ్లినప్పుడు టాయిలెట్ లో ఉండే బ్యాక్టీరియా గాలి ద్వారా మన ఫోన్ పైకి చేరుతుంది. దీనివల్ల ఆ బాక్టీరియా మనం మాట్లాడుతున్నప్పుడు చేతులతో మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు మన చేతుల నుంచి మన కడుపులోకి చేరుతుంది.

టాయిలెట్ లో ఫోన్ వాడితే వచ్చే రోగాలివే
దీనివల్ల డయేరియా, ప్రేగు సంబంధిత వ్యాధులు, మూత్ర వ్యాధులు, మరికొన్ని అంటు వ్యాధులు వంటి తీవ్ర అనారోగ్య పరిస్థితులు వచ్చే ప్రమాదం ఉంది. టాయిలెట్లలో మనకు తెలియకుండానే కంటికి కనిపించని బ్యాక్టీరియా ఉంటుంది. బాత్రూంలో కూర్చుని ఫోన్ మాట్లాడినప్పుడు అది మన ముక్కు, నోరు ద్వారా మన కడుపులోకి వెళ్తుంది. ఫలితంగా రోగాల బారిన పడటం సంభవిస్తుంది.

టాయిలెట్ కు ఫోన్ తీసుకెళ్లకండి
ఇంతే కాదు టాయిలెట్ లో కమోడ్ మీద గంటల కొద్దీ కూర్చుంటే రకరకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మొబైల్ ఫోన్ ను వినియోగించాలనుకునేవారు అతిగా వినియోగించడం ప్రమాదం అనే విషయాన్ని గుర్తించాలి. అంతేకాకుండా ముఖ్యంగా టాయిలెట్లకు వెళ్లేటప్పుడు ఫోన్ తీసుకెళ్లకుండా ఉండాలని గుర్తుపెట్టుకోవాలి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+