చింత గింజలతో ఎంత ఆరోగ్యమో తెలిస్తే అస్సలు పారెయ్యరు!
మనం చింతపండును వాడుకుని చింతగింజలను పడేస్తూ ఉంటాం. అయితే చింతగింజలలోను మన ఆరోగ్యానికి దోహదం చేసే అనేక ప్రయోజనాలు ఉంటాయన్న విషయం మనలో చాలామందికి తెలియదు. ఇక చింతగింజల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? అవి ఏ విధంగా మన శరీరాన్ని రక్షించడానికి దోహదం చేస్తాయి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.
చింత గింజలతో బోలెడు ప్రయోజనాలు
చింత గింజలు మన ప్యాంక్రియాస్ ను రక్షిస్తాయి. చింతగింజలను నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సహజంగానే తగ్గుతాయి. చింతగింజలను కాల్చి పొడి చేసి ఆ పొడితో దంతాలను తోముకుంటే చిగుళ్ళకు , దంతాలకు మంచిది. చింతగింజల పొడిని నీళ్లతో కలిపి పేస్టులా తయారు చేసుకొని పళ్ళు తోముకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.

చింత గింజల పొడితో కొలెస్ట్రాల్ కంట్రోల్
చింత గింజల పొడిని తీసుకోవడం వల్ల అజీర్ణాన్ని నయం చేయవచ్చు. పిత్తం సమస్యతో బాధపడుతున్న వారికి చింత గింజల పొడి సహజ నివారణగా ఉపయోగపడుతుంది. ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. మన శరీరంలో ఇన్ఫెక్షన్ల నుండి నివారించడంలో కూడా చింత గింజలు ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఇవి మనల్ని పేగు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్ల నుండి కాపాడతాయి.
రక్తపోటు, మోకాళ్ళ నొప్పులే కాదు లైంగిక సామర్ధ్యానికి చింత గింజలు
చింత గింజలలో పొటాషియం ఉండడం వల్ల ఇది బీపీని నియంత్రిస్తుంది. అధిక రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి చింతగింజలతో మేలు జరుగుతుంది. ఇక చింతగింజల పొడిని తీసుకోవడం వల్ల మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం దొరుకుతుంది. ఆవు పాలు, చింతగింజల పొడిని కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటే పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
చింత గింజల పొడి తీసుకోవాలంటే ఇలా చెయ్యండి
అయితే చింతగింజల పొడిని తీసుకోవాలనుకునేవారు ఆయుర్వేద నిపుణులతో సంప్రదించిన తర్వాత ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది నిర్ణయం తీసుకోండి. ఒక్కొక్కరి శరీర తీరును బట్టి ఒక్క విధంగా దీని మోతాదు తీసుకోవలసి ఉంటుంది. మొత్తంగా చింత గింజల పొడి తో మనకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకొని చింత గింజలను పారేయకుండా వాడుకుంటే మంచిది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications