తెలంగాణా స్టైల్ బోటీ కూర.. వాసనకే కడుపు నిండుతుంది!

తెలంగాణ వంటకాలలో బోటీ కోరుకున్నటువంటి ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఫంక్షన్లలో, ప్రత్యేకమైన సందర్భాలలో ఈ బోటి కూరను ప్రత్యేక అతిథులకు వడ్డిస్తారు. ఎన్నో పోషక ప్రయోజనాలు ఉన్న, మన ఆరోగ్యానికి దోహదం చేసే, అత్యంత ప్రత్యేకమైన తెలంగాణ స్టైల్ బోటి కూర తయారీ విధానాన్ని తెలుసుకుందాం.

బోటి కూర తయారీకి కావలసిన పదార్థాలు
బోటి- మేక లేదా గొర్రెది ఒకటి
ఉల్లిపాయలు- రెండు పెద్దవి
పచ్చిమిరపకాయలు- 6
కొత్తిమీర- కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్- రెండు స్పూన్లు
గరం మసాలా- ఒక స్పూన్
పసుపు- అర స్పూన్
ఉప్పు- రెండు స్పూన్లు రుచికి తగినంత
కారం- రెండు స్పూన్లు రుచికి తగినంత
ధనియాల పొడి- ఒక స్పూను
నూనె- నాలుగు టేబుల్ స్పూన్లు

Telangana Style Boti Curry Recipe Aroma That Fills Your Stomach and gives immunity too

తయారీ విధానం
ముందుగా బోటీని శుభ్రంగా కడుక్కోవాలి. వేడినీళ్లతో బోటీని క్లీన్ చేసుకోవాలి. ఆపై అందులో ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి కొద్దిసేపు ఉంచి శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పాన్ పెట్టి అందులో నాలుగు స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయ ముక్కలను వేయాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేపుకోవాలి.

బోటీ ఇలా వండుకుంటే టేస్ట్
ఆపై అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని నీళ్లు లేకుండా పిండి అందులో వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో బోటీ బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు ఉడికించాలి. ఆపై అందులో అర స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, రెండు స్పూన్ల కారం వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. అందులో స్పూను గరం మసాలా కూడా వేసి బోటిని బాగా ఉడికించుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి.

బోటీ ముదురుగా ఉంటే ఇలా చెయ్యాలి
కుక్కర్లో బోటీ వండుకునే వాళ్లయితే ఆరు విజిల్స్ వచ్చేవరకు బోటి ని ఉడికించుకోవాలి. బోటి కాస్త ముదురుగా ఉంటే ఎక్కువసేపు ఉడికించవలసి వస్తుంది అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. బోటీ లో సరిపడా వాటర్ లేకపోతే, గ్రేవీ రాకపోతే కొద్దిగా వాటర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. బోటి బాగా ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి కలుపుకోవాలి.

బోటీ ఇలా తింటే అద్భుతంగా ఉంటుంది
మళ్లీ కాసేపు ఉడికించి ఫైనల్ గా కొత్తిమీరను యాడ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి బోటి కూరను అన్నంలో కానీ, బగారా రైస్ లో కానీ, జొన్న రొట్టె, రాగిసంగటి ఇలా ఎందులో అయినా సరే పెట్టుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ బోటి కూర వాసనకే కడుపు నిండిపోతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+