ఆవాలు చేసే అద్భుతాలు అనంతం.. తింటే ఏమవుతుందంటే!

మనం నిత్యం ఆహారంలో ఉపయోగించే అనేక దినుసులు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. కొన్ని రకాల దినుసుల గురించి అవి ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలుసు. అయితే కొన్ని రకాల దినుసులను మనం అంతగా పట్టించుకోము. అటువంటి వాటిలో ఆవాలు ఒకటి. ప్రతిరోజు కూరల్లో ఉపయోగించే ఆవాలు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయనే విషయం చాలామందికి తెలియదు.

ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు
ఆవగింజ అని తీసిపారేయకుండా ఆవాల వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఆవాలను మనం కూరల్లో ఉపయోగించడం మాత్రమే కాకుండా పచ్చళ్ళు చేసేటప్పుడు దానిని పిండిగా చేసి పచ్చళ్లలో వాడుతాం. ఈ ఆవాలను కూరల్లోనూ, పచ్చడిలోను వేసుకొని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఆవాలలో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి.

The health wonders of mustard seeds are endless what happens if you eat it

ఆవాలతో బీపీకి చెక్ .. ఇంకా ఎన్నో
వీటిని తీసుకోవడం వల్ల హై బీపీ కంట్రోల్ అవుతుంది. అంతేకాకుండా శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఆవాలను మనం నిత్యం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనకు కలిగే చిన్న చిన్న అనారోగ్యాల నుంచి ఆవాలు మనల్ని కాపాడతాయి. ఆవాలు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

ఆవాలతో యవ్వనం
ఆవాలలో ఫినోలిక్ కాంపౌండ్స్, టోకో ఫెర్రోల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ లు పుష్కలంగా ఉంటాయి. ఆవాలలో ఉండే ఈ గొప్ప గుణాలు ఇన్ఫ్లమేషన్ ను తగ్గించి లివర్ పనితీరును మెరుగుపరుస్తాయి. మన జీర్ణ సమస్యలను బాగా తగ్గిస్తాయి. ఆవాలలో ఉండే పోషకాలు మన చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జుట్టు బలోపేతంగా ఉండేలా చేస్తాయి. వయసుతో పాటు వచ్చే ముడతలు, ఏజింగ్ లక్షణాలను దూరం చేసి మనం యవ్వనంగా ఉండేలా చేస్తాయి.

ఆవాలతో క్యాన్సర్ కు చెక్
ఆవాలలో క్యాన్సర్ ను తగ్గించే గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఆవాలు క్యాన్సర్ కణాలను పెరగకుండా చూస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ మనల్ని వేధించకుండా ఆవాలు మనల్ని కాపాడతాయి. ఆవాలలో ఉండే పొటాషియం, కాల్షియం మన ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన కీళ్ల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

ఆవాలతో సోరియాసిస్ కు చెక్
ఇక ఆవాలలో ఉండే పోషకాలు మనల్ని సోరియాసిస్ బారి నుండి కాపాడతాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తాయి. రింగ్ వార్మ్ వంటి సమస్యలు రాకుండా చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు కచ్చితంగా రెగ్యులర్ గా ఆవాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+