ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఈ పండ్లు తింటే బోలెడు బెనిఫిట్స్!

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ ఎంతో అవసరం. ప్రోటీన్ మన శరీరానికి కావలసిన బోలెడు ప్రయోజనాలను ఇస్తుంది. కండరాలు దృఢంగా ఉండాలన్నా, కణాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, హార్మోన్ల ఉత్పత్తి సజావుగా జరగాలన్న ప్రతి చర్యకు ప్రోటీన్ చాలా కీలక భూమిక పోషిస్తుంది.

ప్రోటీన్ ఎక్కువఫా ఉండే పండ్లు
అందుకే ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారాలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే కొన్ని రకాల పండ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ పండ్లను రెగ్యులర్ గా మీ ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. మరి ఆ పండ్లు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

There are many benefits of eating these fruits that are high in protein

జామ పండు
జామ పండులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. జామ పండును తినడం వల్ల మన జీవ క్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సంబంధితమైన సమస్యలు పోతాయి. జామపండు డయాబెటిస్ ను తగ్గిస్తుంది. ఒక కప్పు జామ ముక్కల్లో 4.2 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జామకాయలలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది.

అవకాడో
అవకాడో లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది .100 గ్రాముల అవకాడోలో రెండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అవకాడో లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.

కివి పండ్లు
కివి పండ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాములకు కివీ పండ్లలో 1.1 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. విటమిన్ సి తో పాటు అన్ని రకాల పోషకాలు కివి పండ్లలో ఉంటాయి. కివి పండ్లను తింటే మనకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

అరటి పండ్లు
అరటిపండ్లలో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఒక మీడియం సైజు అరటిపండు లో 1.1 నుంచి 1.5 ఐదు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. అరటి పండ్లను తింటే కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

దానిమ్మ పండు
దానిమ్మ పండు లోని ప్రోటీన్ మెరుగుగా ఉంటుంది. 100 గ్రాముల దానిమ్మ గింజల్లో సుమారు 1.7 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దానిమ్మ పండులో మన శరీరానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దానిమ్మ తింటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

బెర్రీ పండ్లు
100 గ్రాముల బ్లాక్ బెర్రీలలో సుమారు 1.4 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. స్ట్రా బెర్రీలు, రాస్ప్ బెర్రీలు కూడా ఇదే విధంగా ప్రోటీన్ కలిగి ఉంటాయి. బెర్రీలు కూడా మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.

disclaimer: ఈ కథనం సౌందర్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+