పెళ్ళైన కొత్త జంటల మధ్య శృంగారలేమి.. కారణాలివే.. మీరు చెయ్యాల్సిందిదే!
ఇటీవల కాలంలో ఏ పెళ్ళయిన కొత్త జంటను చూసినా చిలకా, గోరింకల్లా ఉన్నారు అన్న అభిప్రాయం కలగటం లేదు. ఇద్దరూ ఉద్యోగాలు చేయటం, ఆఫీసు తాలూకా పని ఒత్తిడి, దాంతో పాటు కొత్త సంసార జీవితాన్ని బ్యాలెన్స్ చేయటం వారికి కష్టంగా మారుతుంది. కొంతమంది కొత్త జంటలు ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటూ జాగ్రత్తగా సంసారాన్ని లీడ్ చేస్తుంటే, ఒత్తిడి వల్ల వస్తున్న శృంగార లేమితో చాలామంది సుఖంగా లేరు.
గతంలో సాఫీగా దాంపత్య జీవితం
పూర్వకాలంలో ఇంట్లో ఒకరే ఉద్యోగం చేసేవారు. ఆ ఉద్యోగం కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా సమయానుకూలంగా ఉండేది. ఉద్యోగ బాధ్యతలు ఒకరు తీసుకుంటే, కుటుంబ ఆలనా పాలన బాధ్యతలు మరొకరు చూసుకునేవారు. ఎలాంటి చిరాకులు లేకుండా దాంపత్య జీవితం సాఫీగా సాగేది. అందుకే ఇంటి నిండా పిల్ల పాపలతో కుటుంబాలు కళకళలాడేవి.

కొత్త జంటల మధ్య గ్యాప్
ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ కౌన్సిలర్ లను సంప్రదిస్తున్న కొత్త జంటలు అనేకం. సంసార జీవితంలో సుఖాలను ఆస్వాదించలేకపోతున్నామని, ఇద్దరి మధ్యలో చిరాకులు పెరిగి గొడవల వరకు వెళ్తున్నామని, ఇక శృంగార సమస్యలను కూడా ఏకరువు పెడుతూ తమ ఆవేదనను వెళ్లగక్కుతున్నారు. నూటికి 30 శాతం కొత్త జంటలు ఈ విధంగా ఉన్నారని ఫ్యామిలీ కౌన్సిలర్స్ చెప్తున్నారు.
ఒత్తిడిని జయించలేకపోతున్న కొత్త జంటలు
పని ఒత్తిడితో, శారీరక శృంగార జీవితాన్ని ఆస్వాదించలేక మానసికంగా కుంగిపోతున్న వారిలో పెళ్ళయిన కొత్త జంటలు ఈ మధ్య బాగా పెరిగిపోయారు. ప్రతి విషయానికి చిరాకు పడటం, మాటకు మాట అనుకునే స్థాయికి వెళ్తున్నారు. కానీ వాళ్ళలో వర్క్ లైఫ్ ను బ్యాలెన్స్ చేసి, ఒత్తిడిని జయించి దాంపత్య జీవితాన్ని ఆస్వాదించే పరిస్థితి లేదు. ఒకరిని ఒకరు అర్ధం చేసుకునే ఆలోచన లేదు.
సుఖమయ సంసారానికి శృంగారానిదే కీ రోల్
సంపాదన ఎంత వున్న కలిసి మెలిసి సమయం గడిపే తీరిక లేకపోవటం, ఒత్తిడి కారణంగా శృంగారంపై మక్కువ తగ్గటం, ఫలితంగా కొత్త జంటల మధ్య గ్యాప్ పెరుగుతుంది. ప్రస్తుత బిజీ లైఫ్ లో శృంగారానికి సమయం ఇవ్వలేకపోవటం, ఆఫీసులో ఉన్న ఒత్తిడితో శృంగార సామర్ధ్యం తగ్గటం కూడా సంసారాలలో గ్యాప్ కు కారణం అవుతుంది. ఈ గ్యాప్ లేకుండా సుఖంగా జీవించాలంటే ఒత్తిడిని తగ్గించుకోవటం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయటం తప్పకుండా నేర్చుకోవాలి. ఒత్తిడిని తగ్గించటంలో శృంగారం కీలక పాత్ర పోషిస్తుంది అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి.












Click it and Unblock the Notifications