ఈ 5 అలవాట్లు ఉంటే మీకు డాక్టర్ అవసరంలేదు?
మన జీవితంలో ఏం జరుగుతోంది? అనే విషయంలో ఒక్కోసారి మనకే నియంత్రణ ఉండదు. పరిస్థితులకు తగినట్లుగా మనం ఎలా వ్యవహరిస్తున్నాం? మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? అనేది చాలా ముఖ్యం. లైఫ్ స్టైల్ లో 5 అలవాట్లు పాటించడంవల్ల జీవితంలోని 80 శాతం సమస్యలు సులువుగా పరిష్కారమవుతాయి. ఇన్‌స్టాగ్రామ్‌లోని మెడిటేషన్ సీక్రెట్స్ పేరుతో ఒక పేజీ 5 అలవాట్లను షేర్ చేసింది.
ముందు రోజు రాత్రే.. :తర్వాతరోజు ఏయే పనులు చేయాలో ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఉదయానికి ఏం కావాలో రాత్రికి సిద్ధం చేసుకోవాలి. చేయాల్సిన ప్రతి పనిని ప్రణాళికా బద్దంగా చేస్తుంటే సులభంగా పనులు పూర్తవుతుంటాయి. ముందురోజు రాత్రే ప్లాన్ చేయడంవల్ల ప్రధానంగా ఒత్తిడి తగ్గుతుంది.

5 నిమిషాల పనికి బద్ధకం వద్దు..:చాలామంది 5 నిముషాల్లో పూర్తయ్యే పనిని కూడా గంటల తరబడి వాయిదా వేస్తుంటారు. మరికొందరు రోజుల తరబడి వాయిదా వేస్తారు. ఇటువంటి పనులపై నిర్లక్ష్యం వహించకుండా వెంటనే పూర్తిచేయాలి. చిన్నచిన్న పనులు వెంటవెంటనే పూర్తిచేస్తుండటంవల్ల ఒత్తిడి, అయోమయం దూరమవుతాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ఉదయం చేయాల్సిన పనుల జాబితా:ఉదయం చేయాల్సిన పనులను ముందుగానే తయారుచేసి పెట్టుకోవాలి. ఉదయంపూట త్వరగా నిద్రలేవాలి. యోగా, మెడిటేషన్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదయం సమయంలో ఈ అలవాట్ల వల్ల రోజంతా యాక్టివ్ గా ఉంటారు. జీవితం మెరుగుపడుతుంది.

80/20 నిబంధన అనుసరించాలి:ముందుగా నిర్ధిష్టమైన పనులపై దృష్టి పెట్టాలి. దీనివల్ల శక్తి, సమయం ఆదా అవడంతోపాటు ఉత్పాదకత పెరుగుతుంది. ఇలా చేయడంవల్ల 20 శాతం పనులు 80 శాతం ఫలితాలనిస్తాయి.
తగినంత విశ్రాంతి ఉండాలి:చాలామంది విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తుంటారు. దీనివల్ల మెరుగైన జీవితం అందదు. అనుకున్న పనులు పూర్తిచేయాలంటే శరీరానికి, మనసుకు విశ్రాంతినివ్వాలి. లేదంటే చికాకు, పనిలో అలసట, మానసిక కల్లోలంలాంటివి ఎదురై ఆ పనులు పూర్తికావు.












Click it and Unblock the Notifications