బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గించే సూపర్ టిప్స్ ఇవే.. తగ్గకుంటే చెయ్యాల్సిందిదే!
డయాబెటిస్ తో బాధపడుతున్న చాలామంది బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటిస్తే త్వరగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాలంటే డయాబెటిస్ కంట్రోల్ కావాలంటే శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలి.
బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇలా చెయ్యండి
డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవటం కోసం ఎక్కువగా నీళ్లను తాగాలి. ఇక బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి దాల్చిన చెక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి, బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది.

బ్లడ్ షుగర్ కంట్రోల్ కావాలంటే ఇవి అసలే మరచిపోవద్దు
షుగర్ లెవెల్స్ తగ్గించుకోవడానికి ప్రతిరోజూ తప్పనిసరిగా అరగంట సేపైనా వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసే వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి బ్లడ్ షుగర్ కంట్రోల్ లోకి వస్తుంది. షుగర్ లెవెల్స్ తగ్గాలంటే మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా ఓట్స్, చియా సీడ్స్, ఆపిల్ వంటివి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు ఇవి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటాయి.
షుగర్ కంట్రోల్ కావాలంటే ఇవి కూడా ముఖ్యమే
బ్లడ్ షుగర్ తగ్గాలంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆకుకూరలు, కూరగాయలను తీసుకోవాలి. షుగర్ లెవల్స్ తగ్గించడానికి మరొక మార్గం. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం. టెన్షన్ ఎక్కువగా ఉన్న వారికి షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. కనుక స్ట్రెస్ ను తగ్గించుకోవడానికి ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయాలి.
బ్లడ్ షుగర్ లెవల్ తగ్గాలంటే ఇది తీసుకోండి
భోజనానికి ముందు ఒకటి రెండు టీ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్లలో కలిపి తాగితే కూడా షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగవు. ఇది షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా తినే ఆహారంలో తెల్లటి ఆహారాలను తినకుండా ఉంటేనే మంచిది. అన్నం, తెల్ల రొట్టెలు వంటి వాటికి దూరంగా ఉండాలి. ప్రోటీన్ ఆహారాన్ని తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
బ్లడ్ షుగర్ కంట్రోల్ లో లేకుంటే నిర్లక్ష్యం వద్దు
ఆహారంలో గుడ్లు, చికెన్, గ్రీక్ యోగర్ట్ వంటి ప్రోటీన్ ఉండే ఆహారాలు తినడం మంచిది. ఆహారంలో ఏ ఏ పదార్థాలను తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతున్నాయో తెలుసుకొని వాటిని తినకుండా ఉంటే మంచిది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా పెరిగితే తక్షణం వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
హోటల్ స్టైల్లో "చికెన్ గారెలు" ఎలా చేయాలంటే..? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో












Click it and Unblock the Notifications