గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆరోగ్యకరమైన వంట నూనెలు ఇవే!
ఇటీవల కాలంలో గుండె వ్యాధుల సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. మన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా ఎక్కువ మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. అయితే గుండె జబ్బుల బారి నుండి బయట పడాలంటే జీవనశైలిలో మార్పులు చేసుకోవడంతో పాటు, ఆహారపు అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.
గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన నూనెలు
ఆహారపు అలవాట్లు హెల్దిగా ఉంటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే మంచి ఆహారపు అలవాట్లను చేసుకునేవారు గుండె ఆరోగ్యం కోసం అన్నిటికంటే ముందు నూనె విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వంట నూనె విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర గుండె సమస్యలను నివారించవచ్చు.

నూనెల విషయంలో ఎంపిక అవసరం
మనం తినే వంట నూనెలలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచే కారకాలు ఉండడం వల్ల మన గుండె ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడుతుంది అందుకే మనం తినే ఆహారం కోసం సరైన వంట నూనెలను ఎంపిక చేసుకోవాలి. ఇక ఏ నూనెలు గుండెకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటే
సన్ ఫ్లవర్ ఆయిల్
సన్ ఫ్లవర్ ఆయిల్ లో విటమిన్ ఈ ఉంటుంది. ఇది ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. ఇది మన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి వంటలకు సన్ ఫ్లవర్ ఆయిల్ ఉపయోగించడం ఎంతో మంచిది.
సోయాబీన్ ఆయిల్
సోయాబీన్ ఆయిల్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. అంతేకాదు ఈ నూనెలో పాలీ శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆయిల్స్, విటమిన్స్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి.
ఆలివ్ ఆయిల్
ఆలివ్ ఆయిల్ లో హెల్తీ ఫ్యాట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ తో మన శరీరంలోని కొలెస్ట్రాల్ నియంత్రణ లో ఉంటుంది. ఇది గుండె వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది. ఆలివ్ ఆయిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. క్యాన్సర్ డయాబెటిస్, పార్కిన్సన్ వంటి అనేక సమస్యలకు ఎంతో బాగా పనిచేస్తాయి.
కెనోలా ఆయిల్
కెనోలా ఆయిల్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ ఆయిల్ కారణంగా హై కొలెస్ట్రాల్ సమస్య తొలగిపోతుంది. ఇందులో ఉండే ఫ్యాట్ కారణంగా చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. గుండె వ్యాధుల ముప్పు తగ్గి గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications