పచ్చిఅరటికాయ కూర తింటే శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!
చాలామంది అరటి పండ్లు ఆరోగ్యానికి మంచిదని భావించి అరటి పండ్లు తింటారు కానీ పచ్చి అరటికాయలు మాత్రం తినరు అయితే పచ్చి అరటికాయలో ఉన్న పోషకాలు, అవి మన శరీరానికి అందించే ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలిస్తే ఖచ్చితంగా పచ్చి అరటికాయను ఆహారంలో భాగంగా చేసుకుంటారు. పచ్చి అరటికాయలు అనేక పోషకాలతో మనకు ఆరోగ్యాన్నిస్తాయి.
పచ్చి అరటికాయతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్
పచ్చి అరటికాయను నేరుగా తినలేరు కానీ దానిని కూర లాగా వండుకుని మాత్రం తినొచ్చు. పచ్చి అరటికాయ ఫ్రై, పులుసు, పచ్చడి, అరటికాయ బజ్జీ, అరటి ఫ్రైస్ ఇలా రకరకాలుగా పచ్చి అరటికాయను వండుకుని తినొచ్చు. పచ్చి అరటికాయను తినడం వల్ల శరీరంలో రక్తపోటు కంట్రోల్ అవుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారికి ఈ పచ్చి అరటికాయ కూర ఎంతో మంచిది .

ఆర్గాన్స్ ను కాపాడే పచ్చి అరటికాయ
అంతేకాదు నోటికి సంబంధించిన అనారోగ్యం ఉన్నవారికి కూడా పచ్చి అరటికాయ బాగా పనిచేస్తుంది. దంత క్షయం, నోటి పుండ్లు, పిప్పిపళ్ళ సమస్యలు రాకుండా అరటికాయ కూర కాపాడుతుంది. పచ్చి అరటికాయను డైట్ లో భాగంగా చేర్చుకోవడం వల్ల మన శరీరంలోని అనేక ఆర్గాన్స్ ను అది కాపాడుతుంది.
ఈ సమస్యలకు చెక్ పెట్టే గొప్ప గుణాలున్న కూర
పచ్చి అరటికాయ మూత్రపిండంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడే వారికి ఆ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. పైల్స్ సమస్యతో బాధపడే వారికి పచ్చి అరటికాయ కూర చాలా మంచిది. పచ్చి అరటికాయ కూర తినడం వల్ల ఎముకల ఆరోగ్యం బాగుంటుంది. మెడనొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారికి ఆ ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది.
ఇమ్యూనిటీతో పాటు ఈ సమస్యలకు చెక్
పచ్చి అరటికాయ శరీరానికి కావలసిన ఇమ్యూనిటీని అందించి మన శరీరంలో వైరస్లు, బ్యాక్టీరియా ఎటాక్ చెయ్యకుండా, జబ్బులను కలిగించకుండా నిరోధిస్తుంది. జీర్ణ వ్యాధులతో బాధపడే వారికి కూడా పచ్చి అరటికాయ కూర మంచిది. ఎసిడిటీ, కడుపునొప్పి, అజీర్తి వంటి అనేక సమస్యలను పచ్చి అరటికాయ కూర తగ్గిస్తుంది.
బరువుకు చెక్, నిద్రలేమికి బెస్ట్
నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి పచ్చి అరటికాయ కూర ఎంతో బాగా పనిచేస్తుంది. ఒబేసిటీతో బాధపడేవారు పచ్చి అరటికాయ కూర తినడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు. ఇక ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే పచ్చి అరటికాయ కూరను తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకుంటే ఆరోగ్యం విషయంలో కచ్చితంగా అద్భుతాలే జరుగుతాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications