కళ్ళు మసకబారటం వెనుక కారణాలు ఇవే... జాగ్రత్త!
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాలలోకి కళ్ళు చాలా ముఖ్యమైనవి. మనకు చూపు సరిగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం. అటువంటి కళ్ళ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండడం మంచిది కాదు. కళ్ళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒక్కోసారి చూపుకే ప్రమాదం వస్తుంది. చాలామందికి ఒక్కోసారి చూపు మసక మసకగా కనిపిస్తూ ఉంటుంది. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి.
కళ్ళు మసకబారటం వెనుక కారణాలు
చూపు మసక సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. అసలు ఎందుకు కళ్ళు మసకబారతాయి అంటే.. అనేక కారణాలతో కళ్ళు మసకబారే సమస్య వస్తుంది. కళ్ళల్లో శుక్లాలు ఉన్నా, గ్లోకోమా వంటి సమస్యలతో బాధపడుతున్న, మయోపియా, హైపర్ మెట్రోపియా వంటి కంటి సమస్యల వల్ల కళ్ళు మసకబారుతాయి. అంతేకాదు డయాబెటిస్ బాధితులకు కళ్ళు మసకబారే సమస్య వస్తుంది. డయాబెటిస్ కంటిలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల కూడా చూపు మసకబారుతుంది.

మందులు, ఈ లోపాలతోనూ కళ్ళు మసకబారే సమస్య
అంతేకాదు అధిక రక్తపోటు కంటినరాలను దెబ్బతీస్తుంది. దీని వల్ల కూడా చూపు మసకబారుతుంది. ఇక మనం ఉపయోగించే కొన్ని రకాల మందులు కళ్ళు మసకగా కనిపించేలా చేస్తాయి. ఈ సమయంలో వెంటనే డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది. అంతేకాదు విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ వంటి కొన్ని విటమిన్ల లోపం వల్ల కూడా కళ్ళు మసక బారుతాయి.
కంటి చూపు తగ్గటం వెనుక ఈ సమస్యలు
కొంతమంది శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా కళ్ళు మసకగా కనిపిస్తాయి. అందుకే నీళ్లు ఎక్కువగా తాగాలి. కళ్ళ చూపు మందగించటం వెనుక ఇంకా ఎన్నో కారణాలు ఉంటాయి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా కళ్ళు మసకగా కనిపిస్తాయి.
స్ట్రోక్ తోనూ కంటి చూపు మందగింపు
అందుకే ఎనిమిది గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తారు. ఎవరికైనా స్ట్రోక్ వస్తే కూడా చూపు మసకబారుతుంది స్ట్రోక్ కంటికి రక్తాన్ని సరఫరా చేసే నరాలను దెబ్బతీస్తుంది దీనివల్ల చూపు మసకబారుతుంది ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచి ఫలితం ఉంటుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications