చలికాలంలో వేగంగా బరువు తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే.. ట్రై చెయ్యండి!

ఊబకాయం.. ఇప్పుడు ప్రతీ ఒక్కరిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య. ఇక దీని నుండి బయట పడటం కోసం, బరువు తగ్గటం కోసం చాలామంది ప్రయత్నం నానా అగచాట్లు పడుతున్నారు. చాలామంది చలికాలంలో బరువు తగ్గాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. చలి వాతావరణంలో బరువు తగ్గాలని భావించేవారు కొన్ని ప్రత్యేకమైన ఆహారాల పైన దృష్టి సారించాలి.

బరువు తగ్గాలంటే ఇవి తినండి
ఈ ఆహారాలను తీసుకుంటే కచ్చితంగా బరువు తగ్గుతారు మరి ఆ ఆహారాలను గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. చలికాలంలో బరువు తగ్గాలని భావించేవారు ఆకుకూరలను ఎక్కువగా తినాలి. ఆకుకూరలలో మన శరీరానికి కావలసిన పోషకాలతో పాటు మన బరువు తగ్గేందుకు దోహదం చేసే ఎన్నో విలువైన ఖనిజాలు ఉంటాయి. కనుక ఆకుకూరలు ఈ సీజన్లో బరువు తగ్గటానికి దోహదం చేస్తాయి.

These are the super foods that help you lose weight fast in winter Try them

వీటితో ఊబకాయం నుండి విముక్తి
ఇక ఈ సీజన్లో బరువు తగ్గాలని భావించేవారు గ్రీన్ టీ తాగడం మంచిది. గ్రీన్ టీ లో ఉండే సమ్మేళనాలు మనం బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. కోడిగుడ్డులోని తెల్ల సొనను, అదీ ఉడకబెట్టిన గుడ్డును తింటే కూడా ఈజీగా బరువు తగ్గుతారు. చలికాలంలో బరువు తగ్గాలని భావించేవారు అవకాడోలు తింటే మంచిది. అవకాడోలు మన శరీరానికి కావలసిన పోషకాలను ఇస్తాయి.

వీటిలో బరువు తగ్గించే గొప్ప గుణాలు
అలాగే చలికాలంలో ఈజీగా బరువు తగ్గాలంటే బీన్స్ కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి. బీన్స్ ,చిక్కుడు గింజలు వంటి వాటిని తినడం వల్ల ఇవి మన బరువును తగ్గేలా చేస్తాయి. ఇక చియా సీడ్స్ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తాయి. చలికాలంలో బరువు తగ్గాలని భావించేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా చియా సీడ్స్ ను తీసుకుంటే మంచిది.

ఈ ఆహారాలతో అధిక బరువుకు చెక్
బరువు తగ్గాలంటే బ్రౌన్ రైస్ ఎంతగానో ఉపయోగపడుతుంది. కనుక చలికాలంలో బరువు తగ్గాలని భావించేవారు బ్రౌన్ రైస్ ను ఆహారంలో భాగంగా చేసుకోవాలి. క్వినోవా, ఓట్స్ కూడా బరువును తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. అంతే కాదు సాల్మన్ చేప వంటి కొవ్వు పట్టిన చేపల రకాలు కూడా బరువు తగ్గడానికి ఎంతో దోహదం చేస్తాయి. ముఖ్యంగా ఈ చలికాలంలో ఈ ఆహారాల పైన ఎక్కువ ఫోకస్ చేస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+