మీ జుట్టు రాలుతుందా? అయితే ఇలా చేయండి!
మనిషి అందం మొత్తం జుట్టుపైనే ఆధారపడి వుంటుంది. అందుకే ప్రతి ఒక్కరు జుట్టుకే మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. చిన్న వెంట్రుక ఒక్కటి రాలిపోయినా జీవితాన్ని కోల్పోయినంత బాధపడతారు. జుట్టు రాలకుండా బలంగా ఉండాలంటే మనం కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది.బాదం, వాల్ నట్, విటమిన్ డి అధికంగా ఉన్నవి తీసుకుంటుండాలి. అయితే మనం కొన్ని పదార్థాలు తిన్నప్పుడు కూడా జుట్టు రాలుగుతుంటుంది. అవేమిటో తెలుసుకుందాం.
చక్కెర అధికంగా: చక్కెర ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం జుట్టుకు మంచిది కాదు. హార్మోన్ల సమతుల్యత క్షీణించడంతోపాటు జుట్టు పెరుగుదలలో ప్రభావం కనిపిస్తుంది.

ప్రాసెస్ చేసిన ఆహారం: ప్రాసెస్ చేసిన ఫుడ్ లో పోషకాలుండవు. కొవ్వు, చక్కెర ఉండే ఆర్టిఫిషియల్ పదార్థాలుంటాయి. ఇవి తింటే అనారోగ్యం కలుగుతుంది. పోషకాలు లేకపోవడంవల్ల హెయిర్ ఫోలికల్స్ దెబ్బతింటాయి.
ఫాస్ట్ ఫుడ్: సహజమైన ఆహార పదార్థాలకన్నా ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ తినడమే ఎక్కువైంది. మారుతున్న జీవన శైలి కూడా దీనికి కారణం. కొవ్వు, సోడియం ఫాస్ట్ ఫుడ్ లో ఎక్కువగా ఉంటాయి. దీని ప్రభావం జుట్టుపై పడుతుంది. పొడవాటి జట్టు కోరుకునేవారు ఫాస్ట్ ఫుడ్ కు దూరంగా ఉండాలి.
మద్యం: మద్యంవల్ల శరీరం డీ హైడ్రేట్ అవుతుంది. దీనివల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది. జుట్టు పెరుగుదలపై దీని ప్రభావం పడుతుంది. ధూమపానానికి, మద్యానికి దూరంగా ఉండాలి.
కెఫిన్: కెఫీన్ అధికంగా తీసుకోవడంవల్ల శరీరం డీ హైడ్రేట్ కు గురవుతుంది. జుట్టుపై ప్రభావం పడుతుంది. సాధ్యమైనంత వరకు కెఫీన్ కు దూరంగా ఉండాలి.












Click it and Unblock the Notifications