గుండెకు ఆరోగ్యాన్నిచ్చే సీజనల్ ఫ్రూట్స్ ఇవే!
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అటువంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు ఎంతో ముఖ్యమైనవి. మనదేశంలో ప్రతి సీజన్లోనూ సీజన్ కు తగ్గట్టుగా కొన్ని పండ్లు వస్తాయి. ప్రతి ఒక్క సీజనల్ ఫ్రూట్ ప్రత్యేకమైన ఆరోగ్య ప్రయోజనాలతో ఉంటాయి. ఈ పండ్లు రుచికరంగా ఉండటమే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడంలో సహాయపడుతుంది.
మామిడి పండు
వేసవి కాలంలో వచ్చే మామిడిపండు మంచి పోషకాలతో ఉండే సీజనల్ ఫ్రూట్. మామిడిపండు గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. మామిడిపండ్లు మార్చి నుండి జూన్ వరకు లభిస్తాయి. మామిడి పండ్లు విటమిన్ A , C లతో సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండె ఆరోగ్యానికి మద్దతునిస్తాయి. మామిడిపండ్లలో గుండెను నష్టం నుండి రక్షించే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

దానిమ్మ పండు
శీతాకాలంలో వచ్చే దానిమ్మ పండ్లు కూడా గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి.దానిమ్మలు సెప్టెంబర్ నుండి ఫిబ్రవరి వరకు లభిస్తాయి. ఇవి పాలీఫినాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఈ సమ్మేళనాలు రక్తపోటును తగ్గించడం తో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. దానిమ్మలను క్రమం తప్పకుండా తినడం గుండె సంబంధిత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
జామ పండు
జామ పండు ప్రస్తుతం సంవత్సరం అంతా మనకు లభిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువగా కాసే జామకాయలలో ఫైబర్ మరియు విటమిన్ C అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి.
అరటిపండ్లు
అరటిపండ్లు సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. అరటిపండ్లలో ఫుల్లుగా పోషకాలు ఉంటాయి. ఇవి పొటాషియంను అందిస్తాయి, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. వీటిలో విటమిన్ B6 కూడా ఉంటుంది. ఇది రక్తంలోని హోమోసిస్టైన్ స్థాయిలను తగ్గించడం ద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
ఆపిల్స్
ఆపిల్స్ ముఖ్యంగా ఆగస్టు నుండి నవంబర్ వరకు ఎక్కువగా లభిస్తాయి. సంవత్సరం అంతా ఆపిల్స్ అందుబాటులో ఉంటున్నప్పటికీ ఆగస్టు నుంచి మాత్రం ఆపిల్స్ లభ్యత ఎక్కువగా ఉంటుంది. ఇవి పెక్టిన్ అనే ద్రవీభవించే ఫైబర్ తో మన గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఆపిల్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.ఈ సీజనల్ పండ్లను ఆహారంలో చేర్చడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పైన పేర్కొన్న పండ్లలో ఉండే సహజ పోషకాలు వివిధ గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ ఇస్తాయి.












Click it and Unblock the Notifications