ఈ లక్షణాలుంటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం... జాగ్రత్త!
ప్రస్తుతం సమాజంలో రోజురోజుకీ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. క్యాన్సర్ రావడానికి ముందు అనేక సంకేతాలను శరీరం పంపుతుందని ఆ సంకేతాలపైన దృష్టిపెట్టి అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. క్యాన్సర్ వచ్చే ముందు మన శరీరం పంపించే సంకేతాలు ఏమిటి? ఎటువంటి లక్షణాలను మనం గమనిస్తే మనం క్యాన్సర్ తీవ్రతరం కాకముందే గుర్తించి జాగ్రత్త పడవచ్చు అనేది తెలుసుకుందాం.
క్యాన్సర్ రావటానికి ముందు సంకేతాలు
క్యాన్సర్ రావడానికి ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిల్లో ఒకటి ఆహారాన్ని మింగలేకపోవడం.. గొంతు క్యాన్సర్ వచ్చే ముందు ఆహారం తీసుకునే సమయంలో అసౌకర్యం, నొప్పి, గొంతులో ఇరుక్కున్నట్టు అనిపిస్తుంది కొందరికి. అయితే ఈ లక్షణాలు క్యాన్సర్ వారిలో పడే ప్రమాదాన్ని సూచిస్తున్నాయని చెబుతున్నారు ఇలాంటి లక్షణాలు ఉంటే తల ,మెడ ,దవడ ప్రాంతాలలో క్యాన్సర్ పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఆకలి ఉండదు.. కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉందా
అంతే కాదు చాలామందికి సరిగ్గా ఆకలి అనిపించదు. కొద్ది మోతాదులో ఆహారం తీసుకున్న సరే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలా కొద్ది ఆహారంతోనే కడుపు నిండినట్టు ఫీల్ అయ్యే వారు కూడా వైద్యులను సంప్రదించి పూర్తి వైద్య పరీక్షలు చేయించుకొని అనారోగ్య సమస్యలను నిర్ధారించుకోవాలి లేకపోతే వీరు కూడా క్యాన్సర్ బర్న పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
కడుపులో మంటగా ఉన్నా జాగ్రత్త
ఇక కొంతమంది కడుపులో మంటతో బాధపడుతూ ఉంటారు. కడుపులో , ఛాతిలో మంటగా, ఉబ్బరంగా అనిపిస్తూ ఎక్కువ నొప్పిగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ఒక్కోసారి ఇది అన్నవాహిక క్యాన్సర్ కి కూడా దారి తీయొచ్చని చెబుతున్నారు. కొంతమందిలో కొన్ని సందర్భాలలో వికారం, వాంతులు అవుతుంటాయి.
ఈ లక్షణాలు కనిపిస్తే అలెర్ట్ అవ్వాల్సిందే
తరచూ వికారం, వాంతులు వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఫుడ్ పాయిజన్ అయిందని గ్యాస్ట్రిక్ సమస్య వల్ల ఇలా జరిగి ఉంటుందని భావించకుండా వైద్యులను సంప్రదించి పూర్తి పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇది పొత్తికడుపు క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లకు ముందస్తు హెచ్చరికలాగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఎంత ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేసిన మంచి ఆహారం తీసుకున్న డయేరియా, మలబద్ధకం, మలవిసర్జన సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు వైద్యులను సంప్రదించాలి.
చిన్న సమస్య అని నిర్లక్ష్యం చెయ్యొద్దు
ఎందుకంటే క్యాన్సర్ రావడానికి ముందు ఇటువంటి సంకేతాలను కూడా ఇస్తుంది. కాబట్టి మనకు కనిపించే చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పదేపదే వస్తున్నప్పటికీ చిన్నవి అని పట్టించుకోకుండా ఉంటే భవిష్యత్తులో అవి మనల్ని క్యాన్సర్ బాధితులుగా చేస్తాయి. కాబట్టి క్యాన్సర్ విషయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా అలర్ట్ గా ఉండవలసిన అవసరం ఉంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications