Samantha: స్టార్ హీరోయిన్ సమంత బ్యూటీ సీక్రెట్ ఇదే!
సమంత స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో గుర్తింపు తెచ్చుకున్న నటి. కెరియర్ తొలినాళ్ళల్లో మోడలింగ్ చేసిన సమంత ఏం మాయ చేసావే చిత్రంతో సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసినప్పటినుంచి ఇప్పటివరకు సినిమాలలో వెనుదిరిగి చూడలేదు. 1987 ఏప్రిల్ 28వ తేదీన పుట్టిన సమంత వయసు ఇప్పుడు 38 సంవత్సరాలు.
బ్యూటీ క్వీన్ సమంత ఫాలో అయ్యే టిప్స్
38ఏళ్ళ వయసులో కూడా సమంత బ్యూటీ క్వీన్ లా మెరిసిపోతోంది. అందుకు సమంత చేస్తున్నదేమిటి? సమంత ఎటువంటి డైలీరొటీన్ ఫాలో అవుతారు? ఆమె స్కిన్ కేర్ టిప్స్ ఏమిటి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం. అందంగా ఉండాలని ప్రతి హీరోయిన్ కోరుకుంటారు. అంతేకాదు అందం కోసం తగిన ప్రాధాన్యతను కూడా ఇస్తారు. అదే కోవలో సమంత తన ఫిట్నెస్ ను ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ, అందంగా ఉండడానికి నేచురల్ టిప్స్ ఫాలో అవుతారు.

అందంగా, ఆరోగ్యంగా, ఫిట్నెస్ తో సమంత
శరీరాన్ని ఎప్పుడు డీహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం, మనసును పాజిటివ్ గా ఉంచుకోవడం ఆరోగ్యానికి, అందానికి మూలమని సమంత బలంగా నమ్ముతారు.
ఇక ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించే సమంత ప్రతిరోజు తప్పనిసరిగా వర్కౌట్ చేస్తారు. తన వర్కౌట్ వీడియోలను, ఆరోగ్య సూచనలను ఎప్పుడూ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంటూ ఉంటారు.
తన దినచర్య చెప్పిన సమంత
ఇక ఇటీవల సమంత ట్వీక్ ఇండియాకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమంత తన వ్యక్తిగత అలవాట్లను, తాను యవ్వనంగా కనిపించడానికి ఉపయోగించే ఒక స్కిన్ కేర్ రొటీన్ ను వెల్లడించారు. ఉదయం నిద్ర లేవగానే తాను కృతజ్ఞతా భావంతో జర్నల్ రాస్తానని, మెడిటేషన్ చేస్తానని పేర్కొన్నారు. అలాగే బరువులు ఎత్తడం వంటివి తన దినచర్యలో భాగమని వెల్లడించారు.
సమంత స్కిన్ కేర్ కు వాడేది ఇవే
ఇక తన చర్మ సౌందర్య రహస్యాన్ని చెప్పిన సమంత తన చర్మానికి నిజంగా పనిచేసే కొన్ని ఉత్పత్తులను మాత్రమే ఎంచుకొని, వాటిని మాత్రమే ఉపయోగిస్తానని, చాలా స్టెప్స్ ఉండే స్కిన్ కేర్ రొటీన్ ను తాను ఎప్పుడో వదిలి పెట్టానని తెలిపారు. తన స్కిన్ కేర్ రొటీన్ లో రెటినోల్, సన్ స్క్రీన్, ఒక మంచి సీరమ్ తప్పనిసరిగా ఉంటాయన్నారు.
అందం కోసం ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు
ఇక యవ్వనంగా ఉండే చర్మానికి రెటినోల్ అవసరం లేదని ఆమె పేర్కొన్నారు. అందంగా కనిపించాలి అనుకునేవారు ప్రతి ఒక్క ఫ్యాషన్ ట్రెండ్ ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదని చెప్పిన సమంత మీ చర్మ తత్వాన్ని బట్టి, అందుకు తగినట్టుగా ఉండే ఉత్పత్తులను ఎంచుకుంటే మంచిదని సలహా ఇచ్చారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications