డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే జరిగేదిదే... జాగ్రత్త!
చాలామంది ప్రస్తుతం డయాబెటిస్ తో బాధపడుతున్నారు. డయాబెటిస్ కంట్రోల్లో లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోయి అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపిస్తాయి? మధుమేహ బాధితులు ఎటువంటి సమయాల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదు? వంటి అనేక వివరాలను ప్రస్తుతం తెలుసుకుందాం.
డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే జరిగేదిదే
డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే గుండెజబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారికి వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇక్కడ డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారికి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల మూత్రపిండాల దెబ్బతింటాయి. మూత్రపిండాలు పాడైతే డయాలసిస్ చేయవలసిన పరిస్థితి వస్తుంది.

మధుమేహంతో నరాల సంబంధిత వ్యాధుల, కళ్ళకు ఎఫెక్ట్
ఎవరైతే షుగర్ కంట్రోల్లో పెట్టుకోరో వారికి నరాల సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. డయాబెటిస్ నరాల వ్యవస్థను దెబ్బతీస్తుంది. దీనివల్ల కాళ్లు, చేతులు, ఇతర శరీర భాగాలలో నొప్పులు తిమ్మిర్లు వస్తాయి . డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారికి కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఒక్కోసారి అంధత్వం కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
డయాబెటిస్ కంట్రోల్ లో లేకుంటే ఈ ప్రమాదాలు
మధుమేహం విపరీతంగా ఉన్నవారికి కాళ్లలో గాయాలు, చర్మ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది చివరకు కాళ్లను తీసేసేవరకు కూడా దారి తీయవచ్చు. డయాబెటిస్ కంట్రోల్ లో లేని వారికి ఆయుష్షు బాగా తగ్గుతుంది. కనుక పొరపాటున కూడా డయాబెటిస్ ను నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకోవలసిన అవసరం ఉంటుంది.
డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవటానికి ఇలా చెయ్యండి
జీవన శైలిని మార్చుకొని ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేయాలి. సరైన సమయంలో మందులు వాడడం వంటివి చేసి డయాబెటిస్ ను నియంత్రించాలి. లేదంటే డయాబెటిస్ ఆరోగ్యాన్ని హరించడమే కాకుండా, ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది.












Click it and Unblock the Notifications