40ఏళ్ళ వయసులో 20లా యవ్వనంగా ఉండాలంటే కొలాజిన్ రిచ్ ఫుడ్స్ తినండి!
కొలాజిన్ చర్మ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యమైనది. మన చర్మ నిర్మాణం, ఎలాస్టిసిటీ వంటివి కొలాజిన్ మీదనే ఆధారపడి ఉంటాయి. అయితే వయసు పెరుగుతున్న కొద్దీ కొలాజిన్ తక్కువ కావడంతో ముఖం మీద ముడతలు వచ్చి చర్మం యొక్క ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. చర్మం లూజ్ అయిపోతుంది. అయితే సహజసిద్ధమైన కొన్ని పదార్థాలతో శరీరంలో కొలాజిన్ ను పెంచవచ్చు.
కొలాజిన్ పుష్కలంగా ఉండే ఆహారాలు
40 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల వయసు వారిలాగా కనిపించవచ్చు. కోలాజిన్ పెంచటంలో ముఖ్యంగా విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఆహారాలు కీలక భూమిక పోషిస్తాయి. అలాంటి వాటిలో పండ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం మనం కొలాజిన్ పుష్కలంగా ఉండే ఆహారాల గురించి తెలుసుకుందాం.

బెర్రీస్
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, వంటి బెర్రీ లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. ప్రతిరోజు ఒక కప్పు బెర్రీస్ తింటే వృద్ధాప్య ఛాయలు ఆలస్యం అవుతాయి. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు. ఇది మన చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
సిట్రస్ పండ్లు
సిట్రస్ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కొలాజిన్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా బత్తాయి, నారింజ, నిమ్మకాయలు, గూస్ బెర్రీస్ వంటి పండ్లు కొలాజిన్ కలిగి ఉంటాయి. సిట్రస్ పండ్లు మన శరీరంలో కొలాజిన్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా వాటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మన శరీరం నుండి టాక్సిన్లను తొలగించడంలో కూడా కీలక భూమిక పోషిస్తుంది.
ఉసిరికాయ
ఉసిరిలో కూడా విటమిన్ సి ఉంటుంది. ఇది కొలాజిన్ ఉత్పత్తిలో దోహదం చేస్తుంది. మన చర్మం నిగారింపును సొంతం చేసుకుని యవ్వనంగా కనిపించడానికి ఉసిరికాయని మన ఆహారంలో భాగంగా చేసుకోవడం ఎంతో మంచిది. కొలాజిన్ పుష్కలంగా ఉండే ఆహారాలతో చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తాయి. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో భాగంగా చేసుకుంటే కచ్చితంగా యవ్వనంగా కనిపించే చర్మం సొంతమవుతుంది.












Click it and Unblock the Notifications