టమోటాలు రెగ్యులర్ గా తింటున్నారా- అయితే, ఇది మీ కోసమే..!!
టమోటాలు ప్రతీ ఇంటా నిత్యం వినియోగిస్తారు. అనేక రకాలుగా టమోటాలను ఆహారంలోకి తీసుకుంటారు. టమోటాలు పోషకాలతో నిండి ఉంటాయి. టమోటాల్లోని విటమిన్లు, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడతాయి. టమాటాల్లో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. లైకోపీన్ వల్ల మన శరీరంలో ఉత్పత్తి అయ్యే ఫ్రీ ర్యాడికల్స్ ప్రభావం తగ్గుతుంది. అయితే, టామాటలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలకు బదులుగా ప్రతికూల ప్రభావాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
టమోటాలను తీసుకోవటం ద్వారా ఎన్నో ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులోని లైకోపీన్ వల్ల పలు రకాల క్యాన్సర్లను రాకుండా అడ్డుకోవచ్చని సైంటిస్టుల అధ్యయనాల్లో తేలింది. లైకోపీన్తోపాటు టమాటాల్లో పొటాషియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. ఇవన్నీ కలసి గుండె ఆరోగ్యం కోసం పనిచేస్తాయి. పొటాషియం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. లైకోపీన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లతో కలిసి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఇక టమాటాలను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని చాలా మందికి తెలుసు. కానీ వీటిని రోజుకు ఎంత మోతాదులో తినాలి అని చాలా మందిలో సందేహం ఉంది. టమాటాల్లో లైకోపీన్ అధిక మోతాదులో లభించాలంటే టమాటాలను ఎల్లప్పుడూ ఉడికించే తినాలి. పచ్చిగా ఉండే టమాటా ల్లో లైకోపీన్ తక్కువగా ఉంటుంది. కనుక లైకోపీన్ ఎక్కువగా కావాలనుకునే వారు టమాటాలను ఉడకబెట్టి తింటే మంచిది. టమాటాల్లో ఉండే లైకోపీన్ ఎక్కువగా కొవ్వుల్లో కరుగుతుంది.

నిపుణుల సూచనలు
కాగా, టమాటాలను ఎప్పుడు తిన్నా కొవ్వు పదార్థాలతో తింటే మేలు జరుగుతుంది. ఆలివ్ ఆయిల్, అవకాడో, చేపలు, నెయ్యి, గింజలు, విత్తనాలు వంటి వాటితో కలిపి తింటే లైకోపీన్ను శరీరం ఎక్కువగా శోషించుకుంటుంది. అయితే పచ్చి టమాటాలను తినడం వల్ల కూడా లాభాలు ఉన్నాయి. పచ్చి టమాటాలను తింటే విటమిన్ సి ని అధికంగా పొందవచ్చు. టమాటాలను ఉడికిస్తే విటమిన్ సి ని కోల్పోతాము. టమాటాలను రోజుకు 2 లేదా 3 కు మించి తినకూడదు. కూరల్లో వేసినా, ఉడికించి లేదా పచ్చిగా తిన్నా 3 టమాటాలకు మించి తినకూడదు. ఎక్కువ టమోటాలు తినడం వల్ల పేగు ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. టమోటాలను పెద్ద పరిమాణంలో తీసుకోవడం వల్ల మూత్రాశయ చికాకు వస్తుంది. టమోటా గింజలు కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే కిడ్నీలో రాళ్లు ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉండటం మంచిది. ఆమ్లత్వం - ఉబ్బరం వంటి కడుపు సమస్యలను నివారించడానికి.. పరిమితుల్లో టమోటాలు తినాలని సూచిస్తున్నారు. ఇలా టమాటాలను తింటుంటే ఎన్నో లాభాలను పొందవచ్చు.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
H-1B వీసాదారులకు అమెరికా గుడ్ న్యూస్..! వేతనాల పెంపు ఇలా...! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ ను ఇంకా తక్కువ అంచనా వేస్తున్నారా ? -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ఈ "చామదుంపల బిర్యానీ" ముందు నాన్ వెజ్ బిర్యానీలు కూడా తక్కువే !! -
టేస్టీ టేస్టీ "బెండకాయ మటన్ కర్రీ" ఎలా చేయాలంటే..? -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో










Click it and Unblock the Notifications