వృద్ధాప్యాన్ని కలిగించే ఎంజైమ్స్ తో పోరాడి వయసును తగ్గిస్తుంది!

భారతీయ ఆయుర్వేదంలో త్రిఫల చూర్ణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉసిరికాయ, కాకారకాయ, బీబీటకీ(బహెదా).. అనే మూడు పళ్లతో దీన్ని తయారుచేస్తారు. త్రిఫల అంటే మూడు పళ్లు అనే అర్థం వస్తుంది. మనిషి శరీర ఆరోగ్యాన్ని, తేజస్సును, వ్యాధులను నివారించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీతోపాటు వృద్ధాప్యాన్ని తగ్గించే ఒక అద్భుతమైన పండు బహెదా అని చెప్పవచ్చు.

శ్వాసకోశ సమస్యల చికిత్సతోపాటు డయాబెటిస్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. మనదేశంలో సాధారణంగా దొరికే ఉసిరికాయలో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదంలో కాకరకాయ అత్యంత ముఖ్యమైన మూలిక. త్రిఫల చూర్ణం అంటే ఒక పేరు పొందిన ఆయుర్వేద సూత్రానికి ఉన్న పేరు అది.

triphala churna health benefits and uses in telugu

త్రిఫల చూర్ణం ప్రయోజనాలు
* ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడంవల్ల బరువు తగ్గుతారు. ఊబకాయం ఉన్నవారిపై పరిశోధన చేసి ఈ విషయాన్ని నిపుణులు తేల్చారు.
* బలహీనమైన కంటిచూపును మెరుగుపరిచేందుకు ఆయుర్వేద వైద్యులు దీన్ని ముఖ్యమైన వస్తువుగా సూచిస్తారు.
* త్రిఫలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జట్టు ఎదుగుదలకు ఎంతో ముఖ్యమైనవి
* ప్రతిరోజు క్రమం తప్పకుండా తినడంవల్ల మలబద్ధకం తగ్గుతుంది.
* కడుపు నొప్పి తగ్గించడంలోను, మూత్రనాళం నొప్పి తగ్గించడంలో ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది.
* పంటి సమస్యలను నివారించడంలో త్రిఫల మంచి ఔషధంగా పనిచేస్తుంది.
* ఆయుర్వేదంలో యాంటీ మైక్రోబియల్ కర్తగా ఉపయోగిస్తారు.
* విటమిన్ సి, పోలీఫెనోల్స్, ఇతర యాంటీ ఆక్షిడెంట్లకు గొప్ప మూలకంగా పనిచేస్తుంది.
* షుగరును నియంత్రిస్తుంది.
* యాంటీ క్యాన్షర్ గా దీన్ని ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
* త్రిఫలంవల్ల సులువుగా బరువు తగ్గొచ్చు.
* వ్యాధినిరోధక శక్తిని తగ్గించడమే కాకుండా శరీరంలో వృద్ధాప్యాన్ని కలిగించే ఎంజైమ్స్ తో పోరాడి వయసును తగ్గించడంలో తోడ్పడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+