Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విటమిన్ సి లోపిస్తే త్వరగా వృద్దాప్యం.. ఈ సమస్యలు తప్పవు; జాగ్రత్త!

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ఉండవలసిన పోషకాలు ఖచ్చితంగా ఉండాలి. మనం తినే ఆహారంలో మన శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్, ఖనిజలవణాలు మొత్తం ఉండాలి. మనం తినే ఆహారం సమతుల్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇక మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలలో విటమిన్ సి అత్యంత ముఖ్యమైనది.

విటమిన్ సి లోపిస్తే రకరకాల సమస్యలు
మన రోజువారి డైట్ లో తప్పకుండా విటమిన్ సి ని తీసుకోవాలి. విటమిన్ సి లోపిస్తే రకరకాల సమస్యలు వస్తాయి. విటమిన్ సి అనేది మన శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. మన శరీరంలో కొల్లాజిన్ ఉత్పత్తి పెరగాలన్నా, విటమిన్ సి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్ సి మన శరీర నివారింపును పెంచుతుంది. చర్మం మృదువుగా ఉండేలా చేస్తుంది.

Vitamin C deficiency causes premature aging These problems are inevitable Be careful

విటమిన్ సి లోపిస్తే చర్మ సమస్యలు
విటమిన్ సి లోపం ఉంటే చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తాయి. కనుక ఎవరైతే ఆరోగ్యంగానూ, అందంగానూ జీవించాలి అనుకుంటారో వారు విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు కూరగాయలు తినాలి. విటమిన్ సి లోపం ఉంటే మన చర్మం ఎర్రబడడం, దద్దుర్లు రావడం, చర్మం డ్రై గా మారడం వంటి సమస్యలు చోటుచేసుకుంటాయి. విటమిన్ సి లోపం ఉంటే అలసట ఎక్కువగా ఉంటుంది.

జాయింట్ పెయిన్స్, థైరాయిడ్ సమస్య
దంత క్షయం బాధిస్తుంది. జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి లోపంతో ఇతరత్రా వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. విటమిన్ సి లోపం ఉన్నవారిలో హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉంటుంది.. విటమిన్ సి లోపం ఉంటే ఎనీమియా లేదా రక్తహీనత వస్తుంది.

బరువు తగ్గటం, పాలిపోవటం విటమిన్ సి లోపంతోనే
విటమిన్ సి లోపంతో పంటి చిగుళ్ళ నుండి రక్తస్రావం అవుతుంది. చిగుళ్ల వ్యాధికి ఇది కారణమవుతుంది. శ్వాస సరిగ్గా ఆడకపోవడం, బరువు తగ్గడం, చీటికిమాటికి కళ్ళు తిరగడం, పాలిపోవడం వంటి అనేక లక్షణాలు విటమిన్ సి లోపంతో కనిపిస్తాయి. కనుక విటమిన్ సి లోపం ఉంటే నిర్లక్ష్యం చెయ్యొద్దు. విటమిన్ సి లోపం నివారణ కోసం సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+